Bangladesh Army Chief: బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వంపై ఆర్మీ ఛీఫ్ కీలక ప్రకటన..!

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల మార్పుల తర్వాత చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన రాజీనామా కోరుతూ ఆందోళనలు మిన్నంటడంతో ప్రధాని షేక్ హసీనా పదవి వదిలేసి విదేశాలకు పారిపోయారు. ఇవాళ ప్రధాని అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో ఆమె ప్రత్యేక హెలికాఫ్టర్ లో గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయారు. సాయంత్రం ఆర్మీ ఛీఫ్ జాతినుద్దేశించి ప్రసంగించాల్సి ఉండగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆర్మీఛీఫ్ ముందుగానే టీవీ ముందుకు వచ్చారు.

బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆర్మీ ఛీఫ్ వకారుజ్జమాన్ అకస్మాత్తుగా టీవీ ముందు ప్రత్యక్షమయ్యారు. ఇందులో దేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కానుందని ప్రకటించారు. తాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌ను కలవబోతున్నానని, ఇవాళ రాత్రిలోకా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Bangladesh Army Chief addressed nation hint at new government by today

దేశంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో ఇప్పటికే మాట్లాడినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. అయితే ప్రభుత్వానికి ఎవరు సారథ్యం వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. బంగ్లాదేశ్ ప్రజలందరికీ న్యాయం చేస్తామని ఆర్మీఛీఫ్ ప్రతిజ్ఞ చేశారు.

మరోవైపు AJAX1431- C30J అనే కాల్ గుర్తుతో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ విమానం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భారత గగనతలంపై ఎగురుతున్నట్లు గుర్తించారు. హసీనా తన భవనం నుంచి ఛాపర్ లో బయలుదేరారు. అనంతరం భారతదేశం మీదుగా వెళ్లే ముందు ఎయిర్ ఫోర్స్ విమానంలోకి మారారు. దీంతో లైవ్ ఫ్లైట్ ట్రాకింగ్ యాప్‌లలో పలువురు ఆమెను ట్రాక్ చేస్తుున్నారు. ఈరోజు సాయంత్రం 4.15 గంటలకు ఫ్లైట్‌రాడార్ 24లో విమానం ట్రాక్ అయినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+