బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద బాంబు కలకలం
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత వార్తా ఛానెల్ బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం బాంబు కలకలం రేగింది. సెంట్రల్ లండన్‌లోని రీజెంట్ స్ట్రీట్‌లోని లాంగమ్ ప్యాలెస్ వద్ద బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఓ అనుమానితి వాహనం గంటల కొద్ది నిలిచి ఉండటంతో అందులో బాంబులు ఉన్నాయనే అనుమానం అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేసింది.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు బీబీసీ ప్రధాన కార్యాలయంతో పాటు చుట్టుపక్కల ఉన్న కార్యాలయాలను ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్‌ను రప్పించి అనుమానిత కారును క్షుణ్ణంగా తనిఖీ చేసి పేలుడు పదార్థాలేవీ లేవని తేల్చారు.

దీంతో అక్కడ వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన పారిస్ దాడుల అనంతరం ఐసిస్ ఉగ్రపంజా ఘటనల దృష్ట్యా ప్రధాన నగరాల్లోని అన్ని పత్రికా, టీవీ ఛానెళ్ల వద్ద నిఘా పెంచిన సంగతి తెలిసిందే.
#portlandplace sealed off by police unclear why #London pic.twitter.com/wa0TuKsvAB
— Rebecca Hainsworth (@Becca_Lou18) December 1, 2015 











Click it and Unblock the Notifications