యూఎస్ రాకముందే మోడీకి బైడెన్ షాక్ ? కీలక పోస్టులో ఆ భారతీయురాలు ? అక్కడే ట్విస్ట్ !
భారతీయ మూలాలున్న యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ను అక్కడి ఇమ్మిగ్రేషన్ ప్యానెల్ కీలక పోస్టులో నియమిస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయం భారత్ లోని మోడీ సర్కార్ కు ఇబ్బందికరంగా మారనుంది.
అమెరికాలో బైడెన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో భారతీయ మూలాలున్న వారిని ప్రభుత్వ పదవుల్లో నియమించారు. అప్పట్లో దీన్నో ఘనతగా చెప్పుకున్న భారత ప్రభుత్వానికి ఇఫ్పుడు తాజాగా మరో భారతీయురాలిని కీలక పోస్టులో నియమించడం రుచించేలా లేదు. దీని వెనుక చాలా కారణాలున్నాయి. అయితే యూఎస్ పర్యటనకు ప్రధాని మోడీని ఆహ్వానించిన బైడెన్.. ఆయన రాకకు ముందే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

ప్రమీలా జయపాల్ కు కీలక పోస్టు
అమెరికా చట్టసభ కాంగ్రెస్ లో యూఎస్-ఇండియన్ డెమోక్రాటిక్ మెంబర్ ప్రమీలా జయపాల్ ను బైడెన్ సర్కార్ తాజాగా ఇమ్మిగ్రేషన్ కు సంబంధించిన ఓ కీలక పోస్టులో నియమించింది. యూఎస్ హౌస్ కమిటీకి చెందిన ఇమ్మిగ్రేషన్ నిర్ణయాలు తీసుకునే ప్యానెల్లో ర్యాంకింగ్ సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో అమెరికా అధ్యక్ష పదవికి కూడా పోటీ పడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్న ప్రమీలను ఇప్పుడు బైడెన్ సర్కార్ ఈ కీలక పదవిలో నియమించడం సగటు భారతీయులు గర్వపడే విషయమే అయినా భారత్ లో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు మాత్రం రుచించని నిర్ణయమే.

ఎవరీ ప్రమీలా జయపాల్ ?
వాషింగ్టన్ లోని ఏడో కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న 57 ఏళ్ల ప్రమీలా జయపాల్.. యూఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళ. 16 ఏళ్ల వయసులోనే ఒంటరిగా భారత్ నుంచి యూఎస్ కు తరలివచ్చి స్ధిరపడిన మహిళ. ఆ తర్వాత డెమోక్రాట్ పార్టీలో చేరి తన ప్రస్ధానం సాగించిన ప్రమీల ఇప్పుడు బైడెన్ సర్కార్ లో కీలక స్ధానంలోకి వెళ్లారు. కాంగ్రెస్‌లోకి రాకముందు జయపాల్ సుదీర్ఘకాలం వలసదారుల హక్కుల కోసం పోరాడారు. సెప్టెంబరు 11 దాడుల తరువాత, ఆమె వాషింగ్టన్ రాష్ట్రంలోని అతిపెద్ద వలస హక్కుల సంస్థ అయిన వన్ అమెరికాను ప్రారంభించారు. 4 వేల మందికి పైగా సోమాలియా పౌరుల్ని ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘన పేరుతో దేశం నుంచి బహిష్కరించాలన్న బుష్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రమీల అలుపెరగని పోరాటం చేశారు. తనలాంటి ఇమ్మిగ్రేషన్ బాధితుల కష్టాల్ని తొలగించేందుకు బైడెన్ అప్పగించిన బాధ్యత ఉపయోగపడుతుందని ఇప్పుడు ప్రమీల చెబుతున్నారు.

మోడీ సర్కార్ నిర్ణయాలతో విభేదించి
భారత్ లో కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిలో ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి కాశ్మీర్‌లో అమలులో ఉన్న ఆంక్షలను జయపాల్ విమర్శిస్తున్నారు. ఆమె రెండు విచారణల్లో వాటికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడారు. కాశ్మీర్ లోయలో ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ ప్రతినిధుల సభలో ద్వైపాక్షిక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. తాజాగా
యూఎస్ పర్యటనలో ప్రమీలా జయపాల్ తో భేటీకి భారత విదేశాంగమంత్రి జైశంకర్ నిరాకరించారు. దీనిపై ఘాటుగా స్పందించిన ప్రమీల.. కొన్ని ఆరోపణలు ఉన్నవారిని సమావేశంలో పాల్గొనడానికి నిరాకరించడం ఏ గొప్ప ప్రజాస్వామ్యానికైనా బలహీనతకు సంకేతమంటూ వ్యాఖ్యానించారు.తన హాజరు కారణంగా జైశంకర్ డిసెంబర్ 18 సమావేశం రద్దు చేసుకోవడంపై స్పందిస్తూ.. సంభాషణలు, భిన్నాభిప్రాయాలకు విలువనిచ్చే రెండు దేశాలకు ఇది ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్లేనని ప్రమీల వ్యాఖ్యానించారు.

యూఎస్ రాకముందే మోడీకి బైడెన్ షాక్ ?
మోడీ సర్కార్ నిర్ణయాలతో విభేదిస్తారని పేరున్న ప్రమీలా జయపాల్ ను బైడెన్ సర్కార్ కీలక ఇమ్మిగ్రేషన్ పోస్టులో నియమించింది. త్వరలో ప్రధాని మోడీ యూఎస్ పర్యటనకు రానున్నారు. బైడెన్ ఆహ్వానం మేరకు మోడీ యూఎస్ లో పర్యటించాల్సి ఉంది. దీనికి ముందే ప్రమీలా జయపాల్ ను ఇమ్మిగ్రేషన్ కు సంబంధించిన కీలక పదవిలో బైడెన్ సర్కార్ నియమించడం మోడీ సర్కార్ కు ఎదురుదెబ్బగా మారింది. ముఖ్యంగా విదేశాంగమంత్రి జైశంకర్ తాజాగా ఆమె పాల్గొన్న సమావేశాన్ని రద్దు చేసుకన్న నేపథ్యంలో.. బైడెన్ నిర్ణయం భారత్ పై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications