బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురి సజీవదహనం
బీజింగ్: టపాసులు తయారుచేసే కర్మాగారంలో పేలుడు సంభవించడంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం చైనాలోని హెనన్ రాష్ట్రంలోని టాంషూ కౌంటీలో గురువారం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక బృందం చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

చైనా కొత్త సంవత్సరం వేడుకలకు కొద్ది వారాల ముందే ఈ ప్రమాదం జరగడం బాధాకరమని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే చైనాలోని పలు పరిశ్రమలు సిబ్బంది భద్రతకు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
కాగా, బుధవారం తూర్పు షాంఘైలోని ఓ మెషనరీ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు.












Click it and Unblock the Notifications