భారత అతిథి గృహం టెన్నిస్ కోర్టులో పేలిన రాకెట్ లాంఛర్
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో మంగళవారం మరో పేలుడు చోటుచేసుకుంది. కాబూల్‌లోని గ్రీన్‌జోన్ ప్రాంతంలో ఉన్నభారత అతిథి గృహంలోని టెన్నిస్ కోర్టులో రాకెట్ లాంఛర్ పేలినట్లు సమాచారం.
కాబుల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో మంగళవారం మరో పేలుడు చోటుచేసుకుంది. కాబూల్‌లోని గ్రీన్‌జోన్ ప్రాంతంలో ఉన్నభారత అతిథి గృహంలోని టెన్నిస్ కోర్టులో రాకెట్ లాంఛర్ పేలినట్లు సమాచారం.
అయితే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అఫ్గాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. వారం రోజుల క్రితం కాబుల్‌లోని వీవీఐపీ జోన్‌లో ట్రంక్ బాంబు పేలిన ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

కాగా, వరుస బాంబు ఘటనలో అఫ్ఘానిస్థాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications