టికెట్ లేదు: విమానంలో వెళ్లి శవమైనాడు

పారిస్: టిక్కెట్ లేకుండ విమానంలో దాదాపు 1,000 కిలో మీటర్లు ప్రయాణించిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాలు కొల్పోయాడు. ఎయిర్ ఫ్రాన్స్ కు చెందిన బోయింగ్ 777 విమానం ల్యాండింగ్ గేర్ దగ్గర చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన యువకుడి మృతదేహాన్ని మెయింటెనెన్స్ సిబ్బంది బయటకు తీశారు.

ఎయిర్ ఫ్రాన్స్ కు చెందిన బోయింగ్ 777 విమానం బ్రిజిల్ నుంచి పారిస్ బయలుదేరింది. బ్రిజిల్-పారిస్ ల మధ్య 9,400 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ విమానంలో ఓ యువకుడు రహస్యంగా ప్రయాణించాలనుకున్నాడు.

వెంటనే బోయింగ్ 777 విమానంలోని ల్యాండింగ్ గేర్ దగ్గర దాక్కున్నాడు. విమానం కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణించింది. అక్కడ ఆక్సిజన్ అందకపోవడంతో ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Body found in landing gear of plane at Paris Orly Airport

మంగళవారం విమానం పారిస్ లోని ఓర్లే అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది. మెయింటెనెన్స్ సిబ్బంది యువకుడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. ల్యాండింగ్ గేర్ దగ్గర దాక్కున్న యువకుడు ఊపిరాడక చనిపోయాడని అధికారులు చెప్పారు.

మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించామని, అతను ఎలా చనిపోయాడు, అతను ఎవరు అని పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఇలా విమానంలో రహస్యంగా ప్రయాణించాలని ప్రయత్నించిన ఎవ్వరూ ప్రాణాలతో భయటపడలేదని అధికారులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+