అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్

Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. ఇప్పట్లో తిరిగి వచ్చేల పరిస్థితులు కనిపించట్లేదు. ఇంకొన్ని నెలల పాటు ఆమె అక్కడే గడపడబోతున్నారు. మరో వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌తో కలిసి ఐఎస్ఎస్‌లో ఇంకొంతకాలం ఉండబోతోన్నారు.

వారిని భూమి మీదికి తీసుకుని రావడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపించిన స్పేస్‌క్రాఫ్ట్ ఉత్త చేతులతో భూమికి తిరిగొచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్‌ అందులో ట్రావెల్ చేయట్లేదు. ఐఎస్ఎస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

Boeing Starliner capsule returned to earth without Sunita Williams and Butch Wilmore

ఈ ఏడాది జూన్‌లో సునీతా విలియమ్స్‌ బ్యారీ బుచ్ విల్మోర్‌ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపించింది నాసా. ఇది 10 రోజుల ఆపరేషన్. అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరినీ స్టార్‌ లైనర్ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అక్కడికి పంపింది.

తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు. స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది.

ఈ ఏడాది జూన్ 13వ తేదీన బోయింగ్ స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో సమస్యల తలెత్తాయి. అప్పటికే అది ఐఎస్ఎస్‌తో అనుసంధానమైంది. సర్వీస్ మాడ్యూల్‌లో హీలియం లీక్‌తో పాటు 28 థ్రస్టర్లల్లో అయిదు పూర్తిగా పని చేయడం మానేశాయి. దీనితో ఈ లోపాలను సరిచేయడానికి రంగంలో దిగింది బోయింగ్ సంస్థ.

లోపాలను సరి చేసినప్పటికీ.. అది భూమికి తిరిగి రావడం వరకు మాత్రమే పరిమితమైంది. వ్యోమగాములను తీసుకుని రావడానికి అనుకూలం కాదని ప్రకటించింది. దీనితో బోయింగ్ స్టార్‌లైనర్‌‌ క్యాప్సుల్‌లో సునీత విలియమ్స్, విల్మోర్‌ను తీసుకుని వచ్చే ప్రయత్నాలకు మానుకుంది నాసా.

ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయిన సునీత విలయమ్స్, విల్మోర్‌ను భూమ్మీదికి తీసుకుని రావడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష ప్రైవేట్ పరిశోధక సంస్థ స్పేస్‌ ఎక్స్‌ సహాయాన్ని తీసుకోనుంది. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌‌ క్యాప్సుల్‌లో వారిని భూమికి తిరిగి తీసుకొస్తామని నాసా వెల్లడించింది. సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే తీసుకుని రాగలమని తాజాగా నాసా ప్రకటించింది.

ఐఎస్ఎస్ నుంచి తిరుగుముఖం పట్టిన బోయింగ్ స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌ స్పేస్‌క్రాఫ్ట్ కొద్దిసేపటి కిందటే భూమిపై ల్యాండ్ అయింది. గ్రీన్‌విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) ప్రకారం.. 4:01 నిమిషాలకు న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్‌లో దిగింది. ఐఎస్ఎస్ నుంచి ఆరు గంటల పాటు ప్రయాణించినట్లు సురక్షితంగా ల్యాండ్ అయినట్లు నాసా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+