బూస్టర్ డోసే శ్రీరామ రక్ష.. 4 రెట్ల రక్షణ, ఇజ్రాయెల్ స్టడీ
కరోనాకు విరుగుడు టీకానే.. ఫస్ట్, సెకండ్ డోసు కాక... బూస్టర్ డోసు కూడా వేసుకోవాలని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. బూస్టర్ డోసు వల్ల మంచి జరుగుతుందని పదే పదే చెబుతున్నారు. కొవిడ్-19 వేరియంట్లను తట్టుకోవాలంటే బూస్టర్ డోసు అవసరం పడుతోందని అంటున్నారు. చాలా దేశాలు బూస్టర్ డోసు అందిస్తున్నాయి. అమెరికా, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్ దేశాలు బూస్టర్ డోసులను అందిస్తున్నాయి. బూస్టర్ డోస్ సామర్థ్యంపై ఇజ్రాయెల్ కొత్త అధ్యయనం నిర్వహించింది. అందులో కొవిడ్ బూస్టర్ డోసు సమర్థవంతంగా ఇన్ఫెక్షన్ తగ్గిస్తుందని తేలింది.
కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో కంటే మూడో డోసుతో నాలుగు రెట్లు ఎక్కువగా రక్షణ కల్పిస్తుందని పరిశోధకులు నిర్ధారించారు. ఇజ్రాయిల్‌లో ఇటీవల అదనపు కోవిడ్ టీకాలను అందించారు. మూడో డోసు ఫైజర్ టీకాతో 60 ఏళ్లు దాటిన వారిలో కరోనా ఇన్‌ఫెక్షన్ గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. వ్యాక్సినేషన్ నిపుణుల కమిటీతో మంత్రిత్వశాఖ భేటీ జరిగింది. ఈ డేటాకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. డెల్టా వేరియంట్‌ను నిరోధించేందుకు అమెరికాతోపాటు పలు దేశాలు బూస్టర్ డోసులను ఇస్తున్నాయి.

ఇజ్రాయిల్‌కు చెందిన హెల్త్ ప్రొవైడర్లు ఈ సర్వే నిర్వహించారు. బూస్టర్ డోసు వేసుకున్న 10 రోజుల తర్వాత వైరస్ నుంచి రక్షణ అధికంగా స్థాయిలో ఉందని గుర్తించారు. రెండు డోసులు వేసుకున్నివారిలో కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలిందన్నారు. 60 ఏళ్ల వృద్ధులు, ఆపైబడిన వారిలో వైరస్ నుంచి రక్షణ స్థాయి అధికంగా ఉన్నట్టు గుర్తించారు.
60 ఏళ్లు దాటిన వారిలో 10 రోజుల్లో వైరస్ నుంచి ఆరు రెట్లు రక్షణ పెరుగుతుందని అంచనా వేశారు. అందులో భాగంగానే ఇజ్రాయిల్‌లో జూలై 30వ తేదీ నుంచి మూడవ డోసు అందించారు. కొవిడ్ బూస్టర్ డోసును 40ఏళ్లు దాటిన వారికి కూడా అందించనున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. రెండవ డోసు తీసుకుని 5 నెలలు దాటినవారికి మాత్రమే మూడో బూస్టర్ డోసు అందిస్తున్నారు.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు.
Recommended Video
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications