Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడు.. మాములోడు కాదు, 9 భార్యల్లో ఒకరితో బ్రేక్, మరో ఇద్దరినీ చేసుకుంటాడట.. ఎక్కడంటే..?

ఈ కాలంలో ఒక భార్యతో వేగడమే కష్టం. పిల్లలు, పెళ్లాంతో సరిపోతుంది. కొందరు.. ఇద్దరినీ చేసుకుంటారు. మరికొందరు ఔత్సాహికులు ముగ్గురు, నలుగురిని పెళ్లి చేసుకుంటారు. భారతదేశంలో ఇలా ఉంటే మరే విదేశాల్లో అడ్డూ అదుపు ఉండదు. అవును అక్కడ చట్టాలు ఉన్నా.. బహు భార్యత్వం, ఇల్లిగల్ ఎఫైర్ నడుస్తూనే ఉంటాయి. విడిపోయి ఉండటం వేరు.. ఒకేసారి 8, 9 మంది భార్యలతో ఉండటం వేరు.

అవును.. వారందరినీ శాటిస్‌ఫై చేయాలి.. అంటే సమయం ఇచ్చి.. భోజనం చేసి... అడిగినవి ఇవ్వడం కష్టం. ఒకరిద్దరూ అభిప్రాయాలే కలువవు.. కానీ బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ మొనగాడిలా మారాడు. అవును అక్కడ బహుభార్యత్వం చట్టం ఉన్నా.. 9 మందిని పెళ్లి చేసుకున్నాడు. వారితో సహజీవనం చేస్తున్నాడు. కానీ అందులో ఒకరు విడాకులు అడగడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.

పెళ్లిళ్లు చేసుకొని.. ఫేమ్

పెళ్లిళ్లు చేసుకొని.. ఫేమ్

బ్రెజిల్‌కు చెందిన అర్థర్ ఓ ఉర్సు.. మోడల్.. మోడల్‌గా ఎంత పేరు గడించాడో తెలియదు కానీ.. వివాహాలతో మాత్రం ఫేమ్ అయ్యాడు. ఇప్పటి వరకు అంటే 9 మందిని పెళ్లి చేసుకున్నాడు. కానీ అందులో ఒకరు ఆగాధ విడిపోవాలని అనుకున్నారట. ఈ విషయాన్ని ఉర్సు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఆమె నిర్ణయం తనకు బాధ కలిగించిందని.. అలాగే ఆశ్చర్యపోయానని చెప్పారు. గతేడాది ల్వానా కాజాకీని ఉర్సు వివాహం ఆడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అతను హైలెట్ అయ్యాడు. ప్రేమ, సమానత్వం తనకు ఒక్కటేనని అప్పట్లో అతను చెప్పాడు.

తగ్గిన ఒక భార్య..

తగ్గిన ఒక భార్య..

ఆగాధ తన నుంచి విడిపోవడంతో తన ఒక భార్య తగ్గుతారని ఉర్సు తెలిపారు. తనతో తాను బానే ఉండేవాడినని గుర్తుచేశాడు. ఆగాధ డిసిషన్‌తో తాను షాక్‌లో ఉన్నానని చెప్పారు. కానీ మిగతా 8 మంది మాత్రం అలా ఆలోచించడం లేదని చెప్పారు. ఆగాధ ఆలోచన విధానం తప్పు అని అన్నారు. ఆమె ఏదో భావనతో పెళ్లికి ఓకే చెప్పిందని.. నిజమైన భావం లేదని తెలిపారు. ఉర్సుకు సోషల్ మీడియాలో మంచి ఫాలొయింగ్ ఉంది అతనికి ఇన్ స్టాలో 50 వేల మంది ఫాలొవర్లు ఉన్నారు.

 10 మంది కావాలట..

10 మంది కావాలట..

తన నుంచి ఆగాధ విడిపోయిన ఉర్సుకు ఏ మాత్రం బాధలేదు. తనకు ఒక భార్య వెళ్లినందున మరొకరిని చేసుకోనని చెప్పారు. కానీ తన కల మాత్రం 10 మందిని వివాహాం చేసుకోవడమేనని తన మనసులోని భావాన్ని బయటపెట్టాడు. దానిని త్వరలోనే పూర్తి చేస్తానని తెలియజేశారు. అంతేకాదు తన భార్యలు అందరిపై సమానా ప్రేమ, ఆప్యాయతను పంచుతానని చెప్పారు. ఇందులో మరోమాటకు తావులేదని చెప్పారు.

ఒకేసారి ముగ్గురిని పెళ్లి

ఒకేసారి ముగ్గురిని పెళ్లి


నిజానికి బ్రెజిల్‌లో వివాహానికి సంబంధించి కఠిన ఆంక్సలు ఉంటాయి. బహుభార్యత్వానికి అనుమతి లేదు. అయినప్పటికీ ఆయన తన లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు 8 మంది.. మరో ఇద్దరినీ చేసుకుంటానని చెబుతున్నాడు. మరోవైపు గత నెలలో మరొ వ్యక్తి ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. వారంతా ప్రపోజ్ చేయడంతో చేసుకున్నానని వివరించాడు. ఇలా అంతా బహుభార్యత్వం పాటిస్తున్నారు. విదేశాలు కాబట్టి.. చక్కగా నడుస్తోంది. మరీ ఇండియాలో అయితా.. అంతా సీన్ లేదని కొందరు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+