"అమెరికాకు భారత్ కావాల్సిన దేశం.. భారత్ కు ట్రంప్.."
భారత్ పై అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ కంటే కావాల్సిన దేశం మరోటి లేదన్నారు. భారత్ తో ఉన్న బంధాన్ని తమ దేశం ఎంతో విలువైనదిగా భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లో వచ్చే ఏడాదిలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంలో ఈ మేరకు గోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 12 నుంచి భారత్- అమెరికా మధ్య చర్చలు తిరిగి ప్రారంభం కానున్నట్లు గోర్ పేర్కొన్నారు. ఆయన భారత్ లో అమెరికా రాయబారిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు.
భారత్- అమెరికా వాణిజ్య సంబంధంపై అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జనవరి 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అమెరికాకు భారత్ ఎంతో అవసరమైన దేశం అని గోర్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. వచ్చే ఏడాదిలో భారత్ లో పర్యటించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు దిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంలో మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఉన్న స్నేహం 'రియల్' అని అభివర్ణించారు. రియల్ ఫ్రెండ్స్ తమ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారని పేర్కొన్నారు.

భారత్- అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఎంతో ముఖ్యమైనవిగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. అలాగే భద్రత, కౌంటర్- టెర్రరిజం, ఎనర్జీ, టెక్నాలజీ, ఎడ్యూకేషన్, హెల్త్ అంశాల్లోనూ ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి అన్ని దేశాల్లో పర్యటించానని.. ప్రధాని మోదీతో ట్రంప్ కు ఉన్న స్నేహం రియల్ అని పేర్కొన్నారు. ట్రంప్ వచ్చే ఏడాది భారత్ లో పర్యటించే అవకాశం ఉన్నట్లు గోర్ స్పష్టం చేశారు. అలాగే పాక్స్ సిలికా అలియాన్స్ లో భారత్ సభ్య దేశంగా ఉండబోతుందని గోర్ తెలిపారు. పాక్స్ సిలికా అలియాన్స్ లో భారత్ వచ్చే నెలలో భాగస్వామ్యం కాబోతుందని పేర్కొన్నారు.
-
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
టీ తోటల్లో ప్రధాని మోదీ- అట్నుంచి నరుక్కొస్తున్నారు మరి -
ఈ సాయంత్రం మోదీ అత్యవసర భేటీ- కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం? -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications