బ్రిక్స్ దేశాలకు మోడీ బిగ్ షాక్-ప్రత్యామ్నాయంగా ఫీలవ్వొద్దని సలహా..!
భారత్ తో పాటు 9 దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమికి ప్రధాని నరేంద్ర మోడీ కీలక సలహా ఇచ్చారు. బ్రిక్స్ కూటమిని విస్తరించేందుకు రష్యా, చైనా వంటి దేశాలు చేస్తున్న ప్రయత్నాలపై స్పందిస్తూ.. ప్రపంచ సంస్థలకు ప్రత్యామ్నాయంగా మాత్రం దీన్ని భావించవద్దని మోడీ కోరారు. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ సంస్థలకు ప్రత్యామ్నాయంగా భావించవద్దని సూచించారు.
రష్యాలోని కజాన్‌లో తాజాగా జరిగిన బ్రిక్స్ నేతల శిఖరాగ్ర సదస్సు ముగింపు ప్లీనరీ సెషన్‌లో ప్రధాని మోడీ కీలక ఉపన్యాసం చేశారు. ఈ సంస్థ ప్రపంచ సంస్థల స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు భావించవద్దని సభ్య దేశాల్ని ప్రధాని మోడీ కోరారు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, బహుపాక్షిక రుణదాతల వంటి సంస్థలను సంస్కరించడానికి ఈ బృందం కృషి చేయాలని మోడీ కోరారు.

మరోవైపు తమకు చౌకగా చమురు సరఫరా చేస్తున్న రష్యాతో, అలాగే దక్షిణాసియా దేశాల్లో తయారీని పెంచడానికి, ఉద్యోగాలను జోడించడానికి అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే అమెరికాతో సంబంధాలను బ్యాలెన్స్ చేయడానికి మోడీ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత చైనా, భారతదేశం తమ సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండేళ్లలో తొలిసారి మాట్లాడుకున్నారు.












Click it and Unblock the Notifications