వీడియో: ఎక్కడ తగ్గాలో తెలిసినోడు..!!
జొహాన్నెస్‌బర్గ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి ఈ తెల్లవారు జామున ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. సాయంత్రం జొహాన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. త్రివర్ణ పతాకాలతో మోదీకి స్వాగతం పలికారు.
బ్రిక్స్ సమావేశానికి జొహాన్నెస్‌బర్గ్‌లోని సమ్మర్ ప్లేస్.. వేదిక అయింది. బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు సభ్యత్వం ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్ లావ్రొవ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధినేత గ్ఝి జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా- ఈ అత్యున్నత సదస్సుకు హాజరయ్యారు.

సమ్మర్ ప్లేస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి సిరిల్ రమాఫోసా సాదర స్వాగతం పలికారు. సదస్సు ప్రారంభ సూచికగా వారందరూ గ్రూప్ ఫొటో దిగారు. ఒకే వేదికపై ప్రధాని మోదీ, గ్ఝి జిన్‌పింగ్ కనిపించారు. ఇద్దరు చిరునవ్వుతో పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. గ్రూప్ ఫొటో దిగారు.
సిరిల్ రమాఫోసాతో ముఖాముఖి భేటీ సందర్భంగా అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. భేటీ ప్రారంభానికి ముందు మీడియా కోసం ఏర్పాటు చేసిన వేదికపై సిరిల్‌తో కలిసి వెళ్లారు ప్రధాని మోదీ. అప్పటికే ఆ వేదికపై భారత్, దక్షిణాఫ్రికా జాతీయ పతాకాలు కింద పడి ఉండటాన్ని చూశారు మోదీ. ఆ వెంటనే స్వయంగా కిందికి వంగి చేత్తో త్రివర్ణ పతాకాన్ని తీసుకుని, తన కోటు జేబులో భధ్రపరచుకున్నారు.

సిరిల్ రామఫోసా ఆయనను అనుసరించారు. కిందపడ్డ తమ దేశ పతాకాన్ని ఆయన స్వయంగా తీసుకుని.. పక్కన ఉన్న సిబ్బందికి అందజేశారు. అనంతరం ఫొటోలు దిగారు. ద్వైపాక్షిక సమావేశంలో చర్చించబోయే అంశాల గురించి క్లుప్తంగా మాట్లాడారు. భారత్- దక్షిణాఫ్రికా మధ్య దశాబ్దాల పాటుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు.
#WATCH | Johannesburg, South Africa | PM Narendra Modi notices Indian Tricolour on the ground (to denote standing position) during the group photo at BRICS, makes sure to not step on it, picks it up and keeps it with him. South African President Cyril Ramaphosa follows suit. pic.twitter.com/vf5pAkgPQo
— ANI (@ANI) August 23, 2023
అనంతరం ఈ భేటీకి సంబంధించిన కొంత సమాచారాన్ని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. సిరిల్-మోదీ మధ్య సాగిన చర్చలు ఫలప్రదం అయ్యాయని తెలిపింది. రెండు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, భద్రతతో పాటు వేర్వేరు రంగాల్లో కలిసి పని చేయడం గురించి చర్చించినట్లు వివరించింది.
-
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications