అర్జంటుగా ఫేమస్ అయిపోవాలని.. తల్లిదండ్రులను హత్య చేసిన కొడుకులు
వాషింగ్టన్ : అర్జంటుగా ఫేమస్ అయిపోవాలన్న ఓ విపరీత ధోరణి.. ఇద్దరు టీనేజీ కుర్రాళ్లను కిల్లర్స్ గా మార్చింది. ఫేమస్ అయిపోవడానికి కిల్లర్స్ అవడమే కరెక్ట్ అనుకుని.. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు తోడబుట్టిన వాళ్లను కిరాతకంగా మార్చేశారు ఓ దుర్మార్గ సోదరులు.
అమెరికాలోని ఓక్లోహామాలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓక్లోహామాలోని టల్సా అనే పట్టణంలో నివసించే డేవిడ్ బేవర్, ఏప్రిల్ బేవర్ అనే దంపతులకు ఐదుగురు సంతానం. ఇందులో రాబర్ట్ బేవర్ (19), మైఖెల్ బేవర్ (17) ఐదుగురు సంతానంలో పెద్దవాళ్లు. ఏ ప్రభావం వాళ్లపై బలంగా పడిందో తెలియదు గానీ అర్జంటుగా ఫేమస్ కిల్లర్స్ అయిపోవాలనే దురాశ ఇద్దరిలో మొదలైంది.

తమ కిల్లింగ్ కోరికలను నెరవేర్చుకోవడానికి.. ఇంట్లో వాళ్లనే టార్గెట్ చేసుకున్నారు ఇద్దరు. ఇంట్లో రాత్రి పూట అందరు నిద్రపోతున్న సమయంలో.. ఒక్కసారిగా గొడ్డళ్లు, బ్లేడ్లతో రాబర్ట్, మైఖేల్ వారిపై విరుచుకుపడ్డారు. తల్లిదండ్రులతో సహా ఇద్దరు సోదరుల్ని, ఓ సోదరిని కిరాతకంగా హత్య చేశారు. ఇదే ఘటనలో గాయపడ్డ ఓ 13ఏళ్ల బాలికతో పాటు, రెండేళ్ల పాప ప్రాణాలతో బయటపడినట్లుగా సమాచారం.
గతేడాది విచారణకు వచ్చిన ఈ కేసులో... రాబర్ట్, మైఖెల్ ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించడంతో స్థానిక కోర్టు వీరిద్దరికి యావజ్జీవ శిక్షను విధించింది. ఇందులో రాబర్ట్ ఇప్పటికే శిక్షను అనుభవిస్తుండగా.. మైఖెల్ వచ్చే ఏడాది నుంచి జైలు జీవితం గడపనున్నాడని తాజా విచారణలో కోర్టు తీర్పును వెలువరించింది. వీరిద్దరికీ పెరోల్ కూడా లభించే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications