43 మంది మిలటరీ పోలీసులు జలసమాధి
అర్జెంటీనా: అర్జెంటీనాలో ఘోర ప్రమాదం జరిగి 43 మంది మిలటరీ పోలీసులు జలసమాధి అయ్యారు. 8 మంది ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మిలటరీ పోలీసు అధికారులు తెలిపారు.
అర్జెంటీనా మిలటరీ పోలీసు ఫోర్స్ కు చెందిన బస్సు శాంటియాగో డెల్ ఎస్టీరో నుంచి శాన్ సాల్వడర్ డి జుజుయ్ ప్రాంతానికి బయలుదేరింది. ఆ బస్సులో అర్జెంటీనా మిలటరీకి చెందిన 51 మంది పోలీసులు ఉన్నారు.

మార్గం మద్యలో బూనస్ ఎయిర్స్ ప్రాంతం దగ్గర బ్రిడ్జ్ మీద వెలుతున్న బస్సు అదుపుతప్పి ఒక్క సారిగా నదిలోకి పడిపోయింది. బస్సు డోర్ లాక్ చేసి ఉండటంతో మిలటరీ పోలీసులు లోపలి నుంచి బయటకురాలేకపోయారు.
8మంది పోలీసులు మాత్రం అద్దాలు పగలగొట్గి ప్రాణాలతో బయటపడ్డారు. 43 మంది మిలటరీ పోలీసులు జలసమాధి అయ్యారని అధికారులు తెలిపారు. మృతులకు అర్జెంటీనా అధ్యక్షుడు సంతాపం తెలిపారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications