‘ఎస్’ అన్నారో.. మీ జేబు గుల్లే! కాదంటే.. కేసులే!!
ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడేటప్పుడు.. అవతలి వాళ్లు అడిగిన ప్రశ్నలకు మీ నోటితో ‘ఎస్’ అని మాత్రం ఎన్నడూ అనకండి. అన్నారా.. ఇక మీ జేబు గుల్ల అవడం ఖాయం.
లండన్: గుర్తుతెలియని వ్యక్తులు ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడేటప్పుడు.. అవతలి వాళ్లు అడిగిన ప్రశ్నలకు మీ నోటితో 'ఎస్' అని మాత్రం ఎన్నడూ అనకండి. ఒకవేళ ఏమరుపాటుగా అన్నారా.. ఆపైన మీ జేబు గుల్ల అవడం ఖాయం.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద ఫోన్ కుంభకోణం జరుగుతోందట. అందులో భాగంగా అవతలి వాళ్లు ముందు ఏదో ఒకటి మాట్లాడి.. 'నేను మాట్లాడేది మీకు బాగా వినిపిస్తుందా?' అని అడుగుతారట. మనం దీనికి 'ఎస్' అని సమాధానం ఇస్తే.. ఆ ఒక్క మాటను జాగ్రత్తగా వాళ్లు రికార్డు చేసి పెట్టుకుని.. ఆ తరువాత కావలసిన చోట కట్ పేస్ట్ చేసుకుని వాడేసుకుంటున్నారట.
దాని ఆధారంగా మన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు నొక్కేయడానికి కావలసినన్ని ప్లాన్లు వేస్తారట. ఇలాంటి ఘటనలను ఇప్పటికే అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో వెలుగు చూశాయి. వాళ్లు తమ వస్తువులు లేదా సేవలను మనకు ఇచ్చినట్లుగా వాయిస్ రికార్డు చేసి, అవి మనకు అందినట్లు, దానికిగాను డబ్బు చెల్లించడానికి మన అంగీకారం కోరినట్లుగా ముందు వాయిస్ రికార్డ్ చేస్తారట.

ఆ తరువాత మనం ఎప్పుడో చెప్పిన 'ఎస్' అనే సమాధానాన్ని ఇక్కడ వాడుకుంటారట. ఒకవేళ మనం మనకు ఆ వస్తువులుగాని, సేవలుగాని అందలేదని, అందువల్ల డబ్బు చెల్లించే సమస్యే లేదని చెబితే.. ముందు చెప్పిన సమాధానం తాలూకు ఆడియో క్లిప్ ఆధారంగా మన మీద కేసులు వేసి మరీ డబ్బు దండుకుంటారట.
చాలా వరకు కంపెనీలు తమ వ్యాపారాల కోసం ఫోన్లోనే వాయిస్ సిగ్నేచర్స్ తీసుకుంటున్నాయి. అలాంటి వారికి ఇప్పుడు ఈ స్కామ్ స్టర్లతో పెద్ద ప్రమాదమే వచ్చిపడిందని చెబుతున్నారు. కాబట్టి.. అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాత్రం 'ఎస్' అనే సమాధానాన్ని ఎప్పడు పడితే అప్పుడు చెప్పొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications