Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Canada పౌరసత్వం.. మీ తాతల వారసత్వంతో సాధ్యం!

మీరు విదేశాల్లో పుట్టి ఉండవచ్చు, కానీ మీ రక్తంలో 'కెనడా' మూలాలు ఉంటే చాలు.. ఆ దేశం మిమ్మల్ని తన పౌరులుగా గుర్తించడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు ఉన్న కఠినమైన 'మొదటి తరం' (First Generation) పరిమితిని ఎత్తివేస్తూ కెనడా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వంశపారంపర్యంగా పౌరసత్వం పొందే అవకాశం తరతరాలకు విస్తరించింది.

గతంలో కెనడా వెలుపల జన్మించిన వారికి పౌరసత్వం రావాలంటే, వారి తల్లిదండ్రులు కనీసం ఒకరైనా కెనడియన్ అయి ఉండాలి. ఇది కేవలం మొదటి తరానికి మాత్రమే పరిమితం. కానీ, ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని 2023లో అంటారియో కోర్టు తీర్పునిచ్చింది. ఈ లోపాన్ని సరిదిద్దుతూ కెనడా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు రెండో తరం, మూడో తరం వారైనా సరే.. తమ పూర్వీకుల రికార్డులను చూపిస్తే కెనడియన్ పాస్‌పోర్ట్ పొందవచ్చు.

Canada Citizenship Rule Change New Law Allows Multi-Generations Born Abroad to Claim Canadian Passports

'ఫిజికల్ ప్రెజెన్స్' రూల్.. జాగ్రత్త!

అయితే, ఈ పౌరసత్వం పూర్తిగా 'ఉచితం' కాదు. 2025 డిసెంబర్ తర్వాత జన్మించే పిల్లల విషయంలో ఒక నిబంధన ఉంది. ఆ పిల్లల తల్లిదండ్రులు (కెనడియన్ పౌరులు) ఆ బిడ్డ పుట్టకముందే కనీసం మూడేళ్ల పాటు కెనడాలో నివసించి ఉండాలి. కెనడాతో మీకు నిజమైన సంబంధం ఉందని నిర్ధారించుకోవడానికే ప్రభుత్వం ఈ నిబంధన పెట్టింది.

H1B Visa: 85 వేల మందికి లక్కీ ఛాన్స్, సెలెక్షన్ లిస్ట్ వచ్చేసింది!
H1B Visa: 85 వేల మందికి లక్కీ ఛాన్స్, సెలెక్షన్ లిస్ట్ వచ్చేసింది!

పాస్‌పోర్ట్‌తో పవర్‌ఫుల్ ప్రయోజనాలు..

  • కెనడా పౌరసత్వం అంటే కేవలం ఒక పత్రం కాదు, అదొక పవర్‌ఫుల్ ఆయుధం
  • అపరిమిత హక్కులు: కెనడాలో ఎక్కడైనా నివసించవచ్చు, ఏ ఉద్యోగమైనా చేయవచ్చు.
  • ఉచిత సేవలు: ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థ - దాదాపు ఉచిత ఆరోగ్య సంరక్షణ మీ సొంతం.
  • ట్రావెల్ ఈజ్: కెనడియన్ పాస్‌పోర్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చాలా సులభం.
  • అమెరికా పాస్‌పోర్ట్ కంటే కొన్ని దేశాల్లో కెనడా పాస్‌పోర్ట్ కు ఎక్కువ గౌరవం, తక్కువ నిఘా ఉంటుంది.

ప్రపంచ ధోరణికి భిన్నంగా..

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇటలీ, హంగేరీ వంటి దేశాలు పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేస్తూ, భాషా పరీక్షలు పెడుతుంటే.. కెనడా మాత్రం ప్రక్రియను చాలా సరళం చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం, తక్కువ ఫీజులతో పని పూర్తి చేయడం ఇక్కడ ప్రత్యేకత. అయితే, దరఖాస్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో, ప్రాసెస్ పూర్తి కావడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

Passport రూల్స్ మారాయి, ఎల్లుండి నుంచి చాలా సింపుల్ గా అప్లై చేసుకోవచ్చు
Passport రూల్స్ మారాయి, ఎల్లుండి నుంచి చాలా సింపుల్ గా అప్లై చేసుకోవచ్చు

ప్లాన్-బి కోసం క్యూ కడుతున్న అమెరికన్లు!

ప్రస్తుత రాజకీయ, భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో చాలా మందికి కెనడా పౌరసత్వం ఒక 'రక్షణ వలయం' (Safety Net) లా కనిపిస్తోంది. అందుకే అమెరికా నుంచి కెనడా పౌరసత్వం కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే అక్కడికి వలస వెళ్లకపోయినా, అత్యవసర పరిస్థితుల్లో తలదాచుకోవడానికి 'ప్రత్యామ్నాయ ప్రణాళిక'గా దీనిని భావిస్తున్నారు.

మీకు లేదా మీ బంధువులకు కెనడాతో ఏవైనా పాత సంబంధాలు ఉంటే, పాత పత్రాలను వెతకడం ప్రారంభించండి.. కెనడా ఆహ్వానిస్తోంది!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+