మత్తుమందు ఇచ్చి 21 మంది స్త్రీలపై లైంగిక దాడి

Canadian doctor guilty of molesting 21 women
అట్టావా: కెనడాలోని ఓ అనస్తీసియాలజిస్టు మత్తుమందిచ్చి 21 మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనస్తీసియా మత్తులో చూస్తూ కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్న మహిళలపై ఆ వైద్యుడు లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది.

నాలుగేళ్లపాటు 21 మంది మహిళలపై అతను సాగించిన దారుణాలు 2010లో వెలుగు చూశాయి. టొరొంటోలోని నార్త్ న్యూయార్క్ జనరల్ హాస్పిటల్‌లో మత్తువైద్యుడు జార్జ్ డూడ్ నాట్‌పై ఈ మేరకు కోర్టులో నేరం నిరూపణ అయింది.

సర్జరీలకు ముందు రోగులకు అనస్తీసియా ఇస్తుంటారు. అయితే, ఈ వైద్యుడు మహిళా రోగులు తన చర్యలను అడ్డగించకుండా ఉండేందుకు తగినంత మత్తు ఇచ్చేవాడు. దీనివల్ల వారు కదల్లేకపోయేవారు. కానీ అతడు తమను ముద్దాడుతున్నట్లు, ఇతర లైంగిక చర్యలు చేస్తున్నట్లు తెలుసు.

కానీ ప్రతిఘటించలేని స్థితి అంటూ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వచ్చేనెలలో దోషిగా తేలిన ఆ వైద్యుడికి కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. డాక్టర్ చేతిలో దాడికి గురైన మహిళలకు మధ్య పరిచయాలు లేవు. అయితే, ఆరోపణలతో వారంతా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+