వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘నరమాంస భక్షక పోలీసు’: ఆడవాళ్ల మాంసాన్ని వేయించుకు తినాలని కోరుకున్న ఆ వ్యక్తిని కోర్టు ఎందుకు విడిచిపెట్టింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గిల్బర్టో వాలే

న్యూయార్క్‌ పోలీసు శాఖలో గిల్బర్టో వాలే పోలీసుగా పనిచేసేవారు. ఆయన భార్య పేరు క్యాథ్లీన్ మాంగన్ వాలే.

చాలా మంది భార్యల్లాగే క్యాథ్లీన్‌కు ఓసారి తన భర్తకు ఇంకొకరితో సంబంధం ఏమైనా ఉందేమోనన్న అనుమానం వచ్చింది. సందేహాన్ని దూరం చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో గిల్బర్టో ఏం చేస్తున్నాడో ఆమె చూడాలనుకున్నారు.

గిల్బోర్టో ఇంటర్నెట్ వాడేందుకు క్యాథ్లీన్ కంప్యూటర్‌ను ఉపయోగించేవారు. దీంతో ఆ కంప్యూటర్‌లో క్యాథ్లీన్ ఓ స్పైవేర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేశారు. ఆ తర్వాత తన భర్త ఏం చేస్తున్నాడో తెలుసుకుని ఆమె అవాక్కయ్యారు.

లైంగిక హింసకు గురవుతున్న అమ్మాయిల ఫొటోలను చూడటంతోపాటు గిల్బర్టో 'అమ్మాయిలను ఎలా కిడ్నాప్ చేయాలి?', 'మనిషి మాంసంతో ఏయే వంటలు వండుకోవచ్చు?', 'తెల్లజాతీయులను బానిసలుగా చేసుకోవడం' గురించి ఆయన వెతుకుతున్నట్లు క్యాథ్లీన్ గుర్తించారు.

'గర్ల్ మీట్ హంటర్' అన్న పేరుతో ఓ వెబ్ ఫోరమ్‌లో లైంగిక దాడి, మనిషి మాంసం తినడం గురించి గిల్బర్టో వివరంగా పోస్టులు కూడా పెట్టారు.

వీటికితోడు ఎవరిని ఎప్పుడు ఎలా కిడ్నాప్ చేయాలి, ఎలా చంపి తినాలి అనే విషయంపై ఆ ఫోరమ్‌లో ఇతరులతో గిల్బర్టో చర్చించారు. స్నేహితురాళ్లు, సొంత భార్యతో సహా తనకు తెలిసిన ఆడవాళ్లను చంపి తినడం గురించి కూడా మాట్లాడారు.

గిల్బర్టో వాలే

''నా కాళ్లను కట్టేసి, గొంతు కోసి, రక్తం జిమ్ముతుంటే వాళ్లు చూడాలనుకున్నారు'' అని 2013లో గిల్బర్టో కేసు విచారణ సందర్భంగా కోర్టులో క్యాథ్లీన్ సాక్ష్యం చెప్పారు.

గిల్బర్టోతోపాటు ఆ ఫోరంలో ఉన్న మరో ఇద్దరు, అమ్మాయిలను 'ఒకరి ముందు మరొకరిని అత్యాచారం' చేయాలని మాట్లాడుకున్నారు. ఒకరికి బతికుండానే నిప్పంటించాలని, ఇంకో ఇద్దరిని గ్రిల్‌పై పెట్టి మార్చి మార్చి వేయించాలని కూడా చర్చించారు.

తన భార్య కోర్టులో వాంగ్మూలం ఇస్తుంటే గిల్బర్టో కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.

గిల్బర్టోకు అప్పటికి 28 ఏళ్లు. సైకాలజీలో డిగ్రీ చేసి న్యూయార్క్ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. అంతకు కొన్ని నెలల క్రితమే వారికి ఓ పాప పుట్టింది.

ఆడవారిని అపహరించి, అత్యాచారం చేసి... చంపి, తినాలని కుట్ర పన్నినట్లు అతడిపై కేసు నమోదైంది. కొంత మంది మహిళల సమాచారం కోసం ఆయన ఫెడరల్ డేటాబేస్‌లో వెతికినందుకు కూడా అభియోగాలు ఎదుర్కొన్నారు.

గిల్బర్టో చేస్తున్న పని తెలిశాక క్యాథ్లీన్ భయంతో తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయారు. ఎఫ్‌బీఐకి సమాచారం ఇచ్చారు. తన ల్యాప్‌టాప్, ఇంట్లో ఉన్న మరో కంప్యూటర్‌ యాక్సెస్‌ను ఎఫ్‌బీఐకి ఇచ్చారు.

గిల్బర్టో తనకు తెలిసిన ఓ మహిళను ఓవెన్‌లో పెట్టి వండే విషయంలో సాధ్యాసాధ్యాల గురించి ఆన్‌లైన్‌లో చర్చించిన విషయాన్ని ఉదహరిస్తూ ప్రభుత్వ న్యాయవాది రాండల్ జాక్సన్ కోర్టులో తన వాదనను ప్రారంభించారు.

గిల్బర్టో వాలే

దోషేనా?

ఈ నేరాలకు పాల్పడే విషయమై అతిచిన్న అంశాల గురించి కూడా గిల్బర్టో ఆన్‌లైన్‌లో చర్చించారు. కోర్టుకు సమర్పించిన ఆధారాలు సరైనవి కాదని నిందితుడి తరఫు న్యాయవాదులు కూడా తోసిపుచ్చలేదు.

''హర్రర్ సినిమాల్లోలాగే ఇవి కూడా దిగ్భ్రాంతి, జుగుప్స కలిగించే విషయాలే. అయితే, సినిమాలకు, గిల్బర్టో చేసినదానికి మరో పోలిక కూడా ఉంది. ఇవి నిజాలు కాదు. కేవలం కల్పితాలే'' అని నిందితుడి తరఫు న్యాయవాది జూలియా గాటో అన్నారు.

''ఈ కేసు మౌలిక సూత్రాలనే ప్రశ్నించింది. ఆలోచించే స్వేచ్ఛ, ఆలోచనలను బయటకు చెప్పే స్వేచ్ఛ, మనం ఆలోచించే విషయాలు ఎంత ఘోరంగా అనిపించినప్పటికీ, వాటిని రాసే స్వేచ్ఛ ఉన్నాయా, లేదా అన్న చర్చకు దారితీసింది'' అని ఆమె అన్నారు.

అయితే, గిల్బర్టో తాను ఆన్‌లైన్‌లో ప్రస్తావించిన ఆడవాళ్లను నిజ జీవితంలో ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు.

గిల్బర్టోను 'నరమాంస భక్షక పోలీసు'గా మీడియా చిత్రించడం మొదలుపెట్టింది.

సాధారణ ఆలోచనలు, ప్రమాదకర ఆలోచనల మధ్య ఉన్న తేడా, వాటికి మనస్తత్వపరంగా, న్యాయపరంగా ఉన్న హద్దుల గురించి ఈ కేసు అనేక ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది.

ఒకవేళ నేరాన్ని అడ్డుకునే పేరుతో గిల్బర్టోనూ అడ్డుకోవాలంటే, ఎప్పుడు అడ్డుకోవాలి? 'ఊహించడమే' నేరం అవుతుందా?

జ్యూరీ మాత్రం గిల్బర్టో చేసింది నేరమే అని నిర్ణయించింది. 'అపహరణకు కుట్ర' పన్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఫెడరల్ డేటాబేస్‌లో సమాచారం వెతికారన్న అభియోగాలపై దోషిగా తేల్చింది.

అయితే, గిల్బర్టో ఆ కుట్రల గురించి ఆన్‌లైన్‌లో రాశారే తప్ప, నిజజీవితంలో అవేవీ చేయలేదు.

గిల్బర్టో వాలే

లైంగిక ఉద్ధీపన కోసం కొన్ని సందర్భాలను ఊహించుకుంటూ గిల్బర్టో, ఇంకొందరు ఆన్‌లైన్‌లో అవన్నీ రాశారు.

అయితే, గిల్బర్టోను కేవలం వాటిని రాసినందుకు కాదు, ఇంకొందరితో కలిసి ఈమెయిళ్ల ద్వారా నేరానికి కుట్ర పన్నినందుకు కోర్టు దోషిగా తేల్చింది.

ఆయన చేసిన నేరంలో 'చర్య ఇంకా జరగలేదు'.

మనిషి మాంసం తినాలని వ్యక్తులు ఇలా ఊహించుకోవడం అరుదే. అయితే, చంపడం గురించి మాత్రం చాలా మందికి ఇలాంటి ఊహలు ఉంటాయి.

ఓ అధ్యయనం ప్రకారం పురుషుల్లో 73 శాతం మంది, మహిళల్లో 66 శాతం మంది ఎవరో ఒకరిని చంపే విషయాన్ని ఊహించుకుంటారు.

పురుషులు అపరిచితులను, తమతో కలిసి పనిచేసేవారిని... మహిళలు తమ కుటుంబ సభ్యులను చంపాలని ఊహించుకునే అవకాశాలు ఎక్కువని ఆ అధ్యయనం తెలిపింది.

గిల్బర్టో వాలే

ఎందుకు?

''ఇలాంటి ఘోరమైన పని చేస్తే, ఏం జరుగుతుంది అని ఈ ఊహలు మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. మనం మనసులో ఇలా చేస్తే ఎలా ఉంటుదని ఊహించుకున్నప్పుడు... నిజంగా వారిని హత్య చేయాలన్నది మన కోరిక గానీ, ఉద్దేశం గానీ కాదని మనం గుర్తిస్తాం. అయితే, ఇలా పరిణామాలను సరిగ్గా గుర్తించలేని వ్యక్తులు మాత్రం, భావోద్వేగాలతో కొన్ని చర్యలకు పాల్పడి, జీవితాంతం చింతిస్తారు'' అని క్రిమినల్ సైకాలజీ నిపుణురాలు జూలియా షా అన్నారు.

అంటే చెడు చర్యల గురించి ఊహించుకోవడం వల్ల కూడా మనం చేయకూడని విషయాలు తెలుసుకోవచ్చు. ఒక విధంగా ఇది కూడా మంచిదే. మరి, దీనికి హద్దులు ఉన్నాయా?

గిల్బర్టో విషయంలో మాత్రం తర్వాత అప్పీల్స్ కోర్టు జడ్జి పాల్ గార్డెఫ్ అలాంటి హద్దులు లేవనే అభిప్రాయపడ్డారు. గిల్బర్టోకు అంతకుముందు కోర్టు విధించిన శిక్షను 21 నెలల తర్వాత రద్దు చేశారు.

గిల్బర్టో వాలే

''తన భార్య గురించి, తనకు తెలిసినవారి గురించి గిల్బర్టో చేసిన ఊహలు కచ్చితంగా ఆయన జుగుప్సాకరమైన మనసుతో ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. కానీ, వీటి ఆధారంగా ఆయనను దోషి అని తేల్చలేం'' అని పాల్ గార్డెఫ్ వ్యాఖ్యానించారు.

2012లో ఒకే రోజు న్యూయార్క్‌లో ఒకరిని, పాకిస్తాన్‌లో ఒకరిని, ఒహాయోలో ఒకరిని కిడ్నాప్ చేయాలంటూ ఆన్‌లైన్‌లో ఇతరులతో గిల్బర్టో చర్చించిన విషయాన్ని కూడా పాల్ గార్డెఫ్ నేరంగా పరిగణించలేదు.

''ఆ రోజు అమ్మాయిలను కిడ్నాప్ చేయాలన్న ఉద్దేశం నిజంగా గిల్బర్టోకు ఉందా అన్నది సహేతకుంగా ఆలోచించే ఏ జ్యూరీ కూడా నిర్ధారించలేదు'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Court leaves the man who killed women
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X