డొనాల్డ్ ట్రంప్ రైట్ హ్యాండ్ దారుణహత్య- రక్తపుమడుగులో
అమెరికాకు చెందిన కన్జర్వేటివ్ కార్యకర్త, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ దారుణహత్యకు గురయ్యారు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తోన్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దం వినిపించింది. ఆ వెంటనే ఆయన కుర్చీలోంచి కుప్పకూలిపోవడం ఈ వీడియోల్లో స్పష్టంగా కనిపించింది.
31 సంవత్సరాల చార్లీ కిర్క్ ప్రస్తుతం- అమెరికన్ కమ్ బ్యాక్ టూర్ నిర్వహిస్తోన్నారు ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలలో కనీసం 15 కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళిక వేసుకున్నారు. అందులో భాగంగా తాజా బహిరంగ సభ ఏర్పాటైంది. ఇదే మొదటిది కూడా. ప్రూవ్ మీ రాంగ్ అనే అంశంపై డిబేట్ నిర్వహిస్తోన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు.

డిబేట్ లో భాగంగా ఓ విద్యార్థితో సామూహిక కాల్పులు, ట్రాన్స్‌జెండర్లకు సంబంధించిన అంశాలపై చర్చిస్తోన్నారు. గత 10 సంవత్సరాలలో ఎంత మంది ట్రాన్స్‌జెండర్ అమెరికన్లు సామూహిక షూటర్లుగా మారారో మీకు తెలుసా? అని కిర్క్‌ను ప్రశ్నించగా.. చాలా మంది.. అంటూ ఆయన బదులిచ్చారు. మారణకాండకు దిగే వ్యక్తులు, హింసాత్మక సంఘటనలను లెక్కించాలా? లేదా? అని కిర్క్ బదులిచ్చారు. ఆ వెంటనే కిర్క్ కుర్చీలోంచి పడిపోవడం కనిపించింది.
అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 6:10 నిమిషాలకు కిర్క్.. ఉటా యూనివర్శిటీలో తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత అంటే 6:30 గంటలకు అతను హత్యకు గురయ్యాడు. కాల్పులు జరిగిన వెంటనే కిర్క్ మెడ నుండి రక్తం కారింది. ఆ సమయంలో భార్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ఈ కాల్పుల్లో ఆయన తప్ప మరెవరూ గాయపడలేదు.
ఈ కాల్పులు సాల్ట్ లేక్ సిటీకి సుమారు 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఉటా వ్యాలీ యూనివర్సిటీ. కిర్క్ ప్రసంగ స్థలానికి 180 మీటర్ల దూరంలో ఉన్న లోసీ సెంటర్ పైకప్పు నుండి కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. చార్లీ కిర్క్.. కన్జర్వేటివ్ కార్యకర్తలలో ఒకరు. ట్రంప్ కు అత్యంత ఆప్తుడు. 18 సంవత్సరాల వయస్సులో "టర్నింగ్ పాయింట్ USA" అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. దేశంలోనే అతిపెద్ద కన్జర్వేటివ్ యూత్ మూమెంట్ గా ఇదిఎదిగింది.
డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయంలో విస్తారంగా వినియోగించిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు కిర్క్. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు అనేక మంది యువ ఓటర్లను ఆకర్షించడాడు. జాతి, లింగ, వలస విధానాలపై తరచుగా సాంస్కృతిక యుద్ధ పోరాటాలను నిర్వహించేవారు. ఆయన ప్రసంగం తీరు.. అటు అభిమానులను, ఇటు విమర్శకులను తెచ్చిపెట్టింది. కిర్క్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు సన్నిహితుడు.












Click it and Unblock the Notifications