వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ చూయింగ్ గమ్ తో కరోనా వ్యాప్తి చెక్ .. అమెరికన్ శాస్త్రవేత్తల అధ్యయనం

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారిని నియంత్రించటం కోసం దేశ వ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం చేస్తున్న వివిధ రకాల ప్రయత్నాలలో భాగంగా,తాజాగా ఓ ఆసక్తికరమైన ప్రయోగం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారికి నోటిలోనే ముకుతాడు వేయగల చూయింగ్ గమ్ ను అభివృద్ధి చేసే పనిలో బిజీగా ఉన్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు.

కరోనా కట్టడికి మొక్క ఆధారిత చూయింగ్ గమ్

కరోనా కట్టడికి మొక్క ఆధారిత చూయింగ్ గమ్

కొత్త ప్రయోగాత్మక చూయింగ్ గమ్ ను అభివృద్ధి చేస్తున్నారు పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు. కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించే చూయింగ్ గమ్ ను వారు మొక్కల నుండి అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ కణాలను బంధించే ప్రోటీన్ ఉన్న చూయింగ్ గమ్ ద్వారా లాలాజలంలోని వైరస్ మొత్తాన్ని పరిమితం చేసేలా, అది మనలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కోవిడ్ ప్రసారాన్ని అరికట్టడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

లాలజలంలోని వైరస్ ను లక్ష్యంగా చేసుకునే చూయింగ్ గమ్

లాలజలంలోని వైరస్ ను లక్ష్యంగా చేసుకునే చూయింగ్ గమ్

చూయింగ్ గమ్ ఒక మొక్క ప్రోటీన్‌తో కలుపబడి ఉంటుంది, ఇది వైరస్ ను నియంత్రించటంలో ఉచ్చు వలె పనిచేస్తుంది. ఇది లాలాజలంలో వైరల్ లోడ్‌ను తగ్గిస్తుంది. అంతేకాదు దాని ప్రసారాన్ని తగ్గించగలదని మాలిక్యులర్ థెరపీ జర్నల్‌లో తమ అధ్యయనాన్ని ప్రచురించిన పరిశోధకులు చెప్పారు. కరోనా మహమ్మారి సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా మాట్లాడినప్పుడు, వైరస్‌లో కొంత భాగం బయటకు వెళ్లి ఇతరులకు చేరుతుంది. చూయింగ్ గమ్ లాలాజలంలోని వైరస్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. దానిని యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 ప్రోటీన్‌తో బంధించడం ద్వారా బయటకు రాకుండా చేస్తుంది.

యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్2 పై అధ్యయనం

యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్2 పై అధ్యయనం


మానవులలోని యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 ప్రొటీన్‌లో కణంలోకి ప్రవేశించడానికి కరోనా వైరస్ ప్రయత్నించినప్పుడు అది దానిని బంధిస్తుంది. మహమ్మారికి ముందు, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన హెన్రీ డేనియల్ రక్తపోటు చికిత్స కోసం యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్2 పై అధ్యయనం చేస్తున్నారు. ఆయన ల్యాబ్ పేటెంట్ పొందిన మొక్కల ఆధారిత ఉత్పత్తి వ్యవస్థను ఉపయోగించి యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2ని అభివృద్ధి చేశారు.

చూయింగ్ గమ్ తో వ్యాప్తికి కట్టడి యత్నం

చూయింగ్ గమ్ తో వ్యాప్తికి కట్టడి యత్నం

డేనియల్ మరియు సహోద్యోగి హ్యూన్ (మిచెల్) కూ కూడా మొక్క ఆధారిత ప్రోటీన్‌లతో నింపబడిన చూయింగ్ గమ్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. డేనియల్, కూ మరియు వైరాలజిస్ట్ రోనాల్డ్ కోల్‌మన్ మొక్కలలో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 ని అభివృద్ధి చేశారు. మరొక సమ్మేళనంతో జత చేసి, ఫలితంగా వచ్చిన మొక్కల పదార్థాన్ని దాల్చినచెక్క-రుచి గల గమ్ టాబ్లెట్‌లలో చేర్చారు. చూయింగ్ గమ్ తో కోవిడ్-పాజిటివ్ రోగుల నుండి కరోనా వ్యాప్తి చేయకుండా,యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 తటస్థం చేస్తుందని గుర్తించారు.

Recommended Video

Omicron Variant : Booster Vaccine Coming Soon! || Oneindia Telugu
కరోనా మహమ్మారి నియంత్రణ కోసం జరుగుతున్న అనేక ప్రయోగాలు

కరోనా మహమ్మారి నియంత్రణ కోసం జరుగుతున్న అనేక ప్రయోగాలు

ఇప్పటికే కరోనా కట్టడి కోసం అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకోవటం కోసం జరుగుతున్న ప్రయోగాలే కాదు, కరోనా కొత్త ఉత్పరివర్తనలపై కూడా అధ్యయనం సాగుతుంది. గత ఏడాది కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై విరుచుకుపడిన నాటి నుండి అనేక దేశాలు కరోనాను నివారించే ప్రయోగాలపై బాగా ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్లు, కరోనా మెడిసిన్ లు అభివృద్ది చేసి భారీ ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వ్యాప్తిని కూడా అరికట్టే వివిధ ప్రయోగాలలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు.

English summary
Scientists at the University of Pennsylvania are developing a new experimental chewing gum. They revealed that they were developing chewing gum from plants that reduced the effect of the corona virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X