వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సన్‌వే: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్‌కంప్యూటర్‌ను తయారు చేసింది. వుక్సిలోని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్‌లో దీనిని ఉంచింది. ఈ సూపర్ కంప్యూటర్ పేరు 'సన్‌వే తైహులైట్'. ఈ సూపర్ కంప్యూటర్‌ను నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆఫ్ ప్యారలెల్ కంప్యూటర్ ఇంజినీరింగ్, టెక్నాలజీ (ఎన్‌ఆర్సీపీసీ) సంస్థ రూపొందించింది.

ప్రపంచంలోని 500 అత్యుత్తమ కంప్యూటర్లలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఈ సూపర్ కంప్యూటర్ సెకనుకి 93,000 ట్రిలియన్ క్యాలుక్లేషన్స్‌ను పరిష్కరించగలదు. ఈ కంప్యూటర్‌లో ఉపయోగించిన ప్రాసెసర్లు, ఇతర పరికరాలన్నీ చైనాలోనే తయారైనవని ప్రభుత్వ మీడియా తెలిపింది.

ఇంతకుముందు మొదటిస్థానంలో ఉన్న సూపర్ కంప్యూటర్ తియాన్‌హే-2కన్నా ఇది రెండింతలు వేగంగా, మూడురెట్లు అధిక సామర్థ్యంతో పనిచేయగలదని చైనా మీడియా తెలిపింది. ఈ కంప్యూటర్ ప్రాసెసింగ్ సామర్థ్యం సెకనుకు 125.436 పెటాఫ్లాప్స్ అని పేర్కొంది.

China builds world's most powerful computer

వంద పెటాఫ్లాప్‌ల వేగాన్ని అధిగమించిన తొలి కంప్యూటర్ సన్‌వే తైహులైట్ అని తెలిపింది. ఈ సూపర్ కంప్యూటర్‌ను రూపొందించడంలో 10. 5 మిలియన్ ప్రాసెసింగ్ కోర్స్‌లతో పాటు 40,960 నోడ్‌లను ఉపయోగించారు. ఈ సూపర్ కంప్యూటర్‌లో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌‌ని ఇనిస్టాల్ చేశారు.

ఇక దీనిలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సీపీయూ) చిప్ 25 చదరపు సెంటిమీటర్లేనని వివరించింది. దీంతో ప్రపంచంలో 500 అత్యుత్తమ కంప్యూటర్లు కలిగిన దేశంలో అమెరికాను చైనా అధిగమించింది. అమెరికా వద్ద 165 సూపర్ కంప్యూటర్లు ఉండగా, చైనా వద్ద 167 సూపర్ కంప్యూటర్లు ఉండటం విశేషం.

English summary
A new supercomputer from China has topped the latest list of the world's most powerful machines. The 93 petaflop Sunway TaihuLight is installed at the National Supercomputing Centre in Wuxi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X