వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు షాక్: ఎన్ని కుట్రలు పన్నినా సీపీఈసీ సక్సెస్: చైనా

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ తప్పకుండా విజయవంతమవుతుందని చైనా ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌‌పై భారత్ కుట్రలు పన్నుతోందని పాక్ రక్షణ శాఖ చైనాకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై చైనా స్పందించింది.

చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌‌పై చైనా ఆశలు పెట్టుకొంది. అయితే ఈ మార్గం పీఓకే గుండా వెళ్తోంది. ఈ విషయమై భారత్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయితే ఈ అభ్యంతరాలను పట్టించుకోకుండా కారిడార్ పనులు సాగుతున్నాయి.

పాకిస్థాన్ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరింది. అయితే ఈ ప్రాజెక్టుకు బ్యాంకు రుణాల విషయంలో బ్యాంకులు కూడ అంతగా ఆసక్తిని చూపడం లేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.. ఈ మార్గం ఉగ్రవాదులకు పట్టున్న ప్రాంతం గుండా సాగుతోంది. ఈ కారణంగానే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తిని చూపడం లేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

 చైనా పాక్ కారిడార్ సక్సెస్ అవుతోంది

చైనా పాక్ కారిడార్ సక్సెస్ అవుతోంది

చైనా పాక్ కారిడార్ సక్సెస్ అవుతోందని చైనా ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇండియా ఈ ప్రాజెక్టుకు అడ్డు తగులుతోందని పాకిస్తాన్ చైనాకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులపై చైనా స్పందించింది. భారత్‌-అమెరికాలు సంయుక్తంగా సీపీఈసీ ప్రాజెక్ట్‌పై కుట్రలు పన్నుతున్నాయని పాక్ ఆరోపణలు చేసింది.ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ ప్రాజెక్టు ఆగదని చైనా ప్రకటించింది.

 50 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్న చైనా

50 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్న చైనా

ఓబీఓర్‌ ప్రాజెక్ట్‌పై చైనా 50 బలియన్‌ డాలర్లను ఖర్చు చేస్తుంది.ఈ ప్రాజెక్టును చైనా అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా తీసుకొంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఒన్‌బెల్ట్‌ ఒన్‌రోడ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ఆగదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చేయాంగ్‌ స్పష్టం చేశారు.

 చైనా పాక్ మద్య స్నేహబందానికి కారిడార్ దోహదం

చైనా పాక్ మద్య స్నేహబందానికి కారిడార్ దోహదం

చైనా-పాకిస్తాన్‌ల మధ్య సుదీర్ఘకాలం స్నేహ సంబంధాలను కాపాడేందుకు ఎకనమిక్‌ కారిడార్‌ దోహదం చేస్తుందని హువా చేయాంగ్‌ చెప్పారు.ఇరుదేశాల్లో అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్‌ ఉపయోగపడుతుందన్నారు.ఈ రెండు దేశాలు ప్రాజెక్టు సత్వరం పూర్తయ్యేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 దక్షిణాసియాభివృద్దికి దోహదం

దక్షిణాసియాభివృద్దికి దోహదం

ఇది చైనా, పాక్‌లతోపాటు మొత్తం దక్షిణాసియా దేశాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఊతమిస్తుందని చేయాంగ్‌ తెలిపారు. భవిష్యత్‌లో చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌కు ఇతర దేశాల నుంచి ఊహించని మద్దతు లభిస్తుందన్నారు.

English summary
China on Tuesday said it is confident in ensuring the success of the USD 50 billion CPEC, a day after Pakistan’s security czar alleged that the US along with India is conspiring against the ambitious economic corridor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X