• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా-పాక్ కారిడార్: రూట్ మార్పుకు నో చెప్పిన డ్రాగన్

By Narsimha
|

బీజింగ్: పాక్‌తో వర్తక వ్యాపారాలు కొనసాగించే విషయంలో భారత్‌ చేసిన ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. చైనా-పాక్‌ ఎకనామిక్‌ కారిడర్‌ పేరును మార్చి.. జమ్ము కశ్మీర్‌(సమస్మాత్మక) మార్గంలో కాకుండా మరో ప్రత్యామ్నాయ రూట్‌లో వ్యాపారం కొనసాగించాలని భారత్‌ సూచించింది. కానీ, అందుకు చైనా సుముఖత వ్యక్తం చేయలేదు.

  Pakistan Rejects China's Offer of Diamer-Bhasha Dam in PoK

  పాక్‌కు మరోసారి చైనా నుండి షాక్ ఇచ్చింది. చైనా పాక్ ఎకనామిక్ కారిడర్ విషయంలో రూట్ మార్చాలని చైనాను పాక్ కోరింది. అయితే ఈ ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది.

  భారత్ వైపే చైనా మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చైనా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఓబీఓఆర్‌ ప్రాజెక్టు నేపథ్యంలో భారత్‌ సలహాను చైనా పాటించే అంశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.

   కాశ్మీర్‌పై ఇండియా. పాక్‌లే చర్చించుకోవాలి

  కాశ్మీర్‌పై ఇండియా. పాక్‌లే చర్చించుకోవాలి

  కశ్మీర్‌ సమస్య భారత్‌-పాక్‌దే తప్ప.. తమది కాదని.. చర్చల ద్వారానే ఆ రెండు దేశాలు పరిష్కరించుకోవాలని సూచించింది చైనా. భారత్‌లోని చైనా రాయబారి లూఓ ఝావోయూయి అభిప్రాయపడ్డారు. భారత్‌ నుంచి ప్రతిపాదన వస్తే మంచిదని.. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు జింగ్‌ పింగ్‌. ఓబీఓఆర్‌ ప్రాజెక్టు నేపథ్యంలో భారత్‌ సలహాను చైనా పాటించే అంశాలే ఎక్కువ ఉన్నాయని లూఓ చెప్పారు.

   68 దేశాలను కలుపుతూ చైనా ఎకనామిక్ కారిడార్

  68 దేశాలను కలుపుతూ చైనా ఎకనామిక్ కారిడార్

  వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ పేరుతో 68 దేశాలను కలుపుతూ ఎకనమిక్‌ కారిడార్‌ నిర్మించాలని చైనా ప్రతిపాదించింది. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోని 68 దేశాలను కలపాలని చైనా ప్రతిపాదించింది. తీవ్రవాద ప్రభావిత దేశాల్లో ఈ ప్రాజెక్టు కొనసాగే అవకాశం ఉన్నందున పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు, బ్యాంకులు సైతం వెనకంజ వేస్తున్నాయి.

  పొరుగు దేశాలతో స్నేహంగా ఉండాలి

  పొరుగు దేశాలతో స్నేహంగా ఉండాలి

  వన్ బెల్ట్ వన్ రోడ్ పై 29 దేశాల ప్రతినిధులతో బీజింగ్‌లో ఇటీవల సదస్సు నిర్వహించారు. భారత్‌ ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సదస్సు నుంచి బయటకు వచ్చేసింది. పొరుగున ఉన్న దేశాలతో స్నేహ పూర్వక ఒప్పందాలు చేసుకోవటం అలవరచుకుంటే మంచిదని ఆ సమయంలో చైనా భారత్‌కు చురకలంటించగా.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా వెళ్తునందునే తాము ఓబీఓఆర్‌ను వ్యతిరేకిస్తున్నట్లు భారత్‌ తేల్చేసింది.

   చైనా -పాక్ ఎకనామిక్ కారిడార్‌ హక్కుల ఉల్లంఘనే

  చైనా -పాక్ ఎకనామిక్ కారిడార్‌ హక్కుల ఉల్లంఘనే

  చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఐరోపా మేధావులు గత కొంతకాలంగా వాదిస్తూ వస్తున్నారు. సీపీఈసీ కారిడార్‌ అనేది గిల్గిత్‌-బలిస్తాన్‌ ప్రాంత ప్రజల హక్కులను కాలరాయడమేనని వారు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని వారు స్పష్టం చేశారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Chinese foreign ministry on Thursday responded to a statement by its ambassador in India, Luo Zhaohui, who recently said Beijing is prepared to rename the China-Pakistan Economic Corridor (CPEC) to address India's concerns. The ministry neither endorsed nor denied Luo's statement, suggesting that it was encouraging Luo to negotiate with New Delhi over the issue, while ensuring that it did not upset Islamabad either.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more