China vs US: ఖబడ్దార్ రెచ్చగొట్టారో.. ఈ క్షిపణి ప్రయోగిస్తామంటున్న చైనా,ఇంతకీ ఏంటీ మిస్సైల్

చైనా మరో దురాగతానికి తెగబడింది. చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకునే కొన్ని గంటల ముందు DF-17 క్షిపణిని లాంచ్ చేస్తున్న ఓ వీడియోను బహిర్గతం చేసింది.ఈ క్షిపణి అత్యంత శక్తివంతమైనదిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఎయిర్‌ క్రాఫ్ట్ కిల్లర్‌గా పిలుస్తున్న ఈ అత్యంత శక్తిమంతమైన క్షిపణిని అడ్డుకోవడం అసాధ్యమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలే తైవాన్ జలసంధి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొనడం, అదే సమయంలో అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటన వేళ చైనా ఈ వీడియోను రిలీజ్ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

చైనా ప్రభుత్వ వార్తా ఛానెల్ ఈ వీడియోను ప్రసారం చేసింది. 81 సెకన్లలోనే చైనా బలగాలు ఎంత శక్తివంతమైనవో చెబుతోందంటూ ఛానెల్ ఈ వీడియోలను టెలికాస్ట్ చేసింది. 2019 అక్టోబర్ 1వ తేదీన నేషనల్ డే మిలటరీ పరేడ్‌లో ఈ ప్రమాదకరమైన క్షిపణిని ప్రదర్శించారు. ఇప్పుడు ఓ ఎడారిలో క్షిపణిని పరీక్షించిన దృశ్యాలు ప్రసారం చేశారు. ఈ క్షిపణిని చూసిన డిఫెన్స్ నిపుణులు ఇది అత్యంత శక్తిమంతమైన మిసైల్‌గా పేర్కొన్నారు. అయితే ఈ క్షిపణి నిజంగానే DF-17శ్రేణికి చెందిఉంటే ఇక చైనాను ఆపడం ఎవరి తరం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

China releases video footage of DF-17 missile amid Nancy Pelosis visit to Taiwan

ఎడారిలోని హైవేపై ఇలాంటి ఒక క్షిపణిని ప్రదర్శించారంటే ఈ తరహా క్షిపణులకు పరీక్షించేందుకు ఫలానా చోటు అంటూ ఏమీ ఉండదనే కంక్లూజన్‌కు నిపుణులు వచ్చేశారు.ఈ తరహా క్షిపణిని ఎక్కడైనా ఎప్పుడైనా పరీక్షించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తేల్చేశారు. దీనికున్న చురుకుతనంతో పాటు సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి స్వతంత్రంగా ఎక్కడైనా పరీక్షించొచ్చని నిపుణులు తెలిపారు.అయితే ఈ క్షిపణిని ట్రాక్ చేయడం శతృవులకు అంత తేలికైన పనికాదని కూడా చెబుతున్నారు. DF-17 క్షిపణి వార్‌హెడ్‌గా హైపర్ సానిక్ గ్లైడర్‌ను వినియోగిస్తుంది.మాక్ 5 కంటే ఐదురెట్ల వేగంతో ఇది దూసుకెళ్లగలదు.ప్రస్తుతం ఉన్న డిఫెన్స్ వ్యవస్థలో ఈ క్షిపణిని అడ్డుకునే సత్తా ఏ ఇతర క్షిపణికి లేదని నిపుణులు స్పష్టం చేశారు.

ఇక DF-17 క్షిపణి చైనా సరిహద్దులను కాపలా కాయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.అంటే చైనా సరిహద్దులు పంచుకునే దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి, ఈశాన్య ఆసియా ప్రాంతం,ఇవన్నీ టార్గెట్‌కు దగ్గరలోనే ఉన్నాయని చైనా నిపుణుడు యాంగ్ ఛెంగ్‌జున్ 2019లో DF-17 క్షిపణి లాంచ్ సందర్భంగా చెప్పారు. అంతేకాదు కదులుతున్న లక్ష్యాలను కూడా ఇది టార్గెట్ చేయగలదని స్పష్టం చేశారు.

తైవాన్‌లో పర్యటించేందుకు అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసి సిద్ధమవుతున్న వేళ తైవాన్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.అమెరికా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఎంతదూరమైనా వెళతామనే సంకేతాలను చైనా ఈ క్షిపణి ప్రయోగం ద్వారా ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తైవాన్ చైనాలో అంతర్భాగమేనని దాన్ని తప్పకుండా పోరాడి సొంతం చేసుకుంటామని చైనా గట్టిగా విశ్వసిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+