పుతిన్‌తో చైనా అధినేత ఎమర్జెన్సీ భేటీ- నిశితంగా పరిశీలిస్తోన్న భారత్
చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ మూడు రోజుల రష్యా పర్యటన ఇవ్వాళ ఆరంభమైంది. ఇందులో భాగంగా ఆయన మాస్కోలో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు.
మాస్కో: చైనా (China) అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ (Xi Jinping).. రష్యా (Russia)లో అడుగు పెట్టారు. ప్రస్తుతం ఆయన రష్యాలో పర్యటిస్తోన్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన ఉంటుంది. చైనా అధినేతగా వరుసగా మూడోసారి ఎన్నికైన తరువాత (Xi Jinping) గ్ఝి జిన్ పింగ్ తొలిసారిగా రష్యాలో పర్యటిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ (Ukraine)తో సుదీర్ఘకాలంగా యుద్ధాన్ని కొనసాగిస్తోన్న నేపథ్యంలో- చైనా అధ్యక్షుడి రష్యా పర్యటనను ఒకరకంగా దీన్ని ఎమర్జెన్సీ టూర్ గా భావిస్తోన్నారు. ఈ పరిణామాలన్నింటినీ భారత్ నిశితంగా పరిశీలిస్తోన్నట్లు చెబుతున్నారు.
గ్ఝి జిన్ పింగ్- మూడు రోజుల రష్యా పర్యటన ఇవ్వాళ ఆరంభమైంది. రాజధాని బీజింగ్ (Beijing) నుంచి ప్రత్యేక విమానంలో ఆయన మాస్కోకు బయలుదేరి వెళ్లారు. ఈ మధ్యాహ్నం విమానాశ్రయంలో దిగారు. రష్యా విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారులకు ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. జిన్ పింగ్ గౌరవార్థం సైనిక కవాతును నిర్వహించారు. అనంతరం ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తో భేటీ అయ్యారు.
🇨🇳🇷🇺Russian President Vladimir Putin meets with Chinese President Xi Jinping
— Russian Victory is Inevitable 🇷🇺 (@WinRussiawill) March 20, 2023
🔻Vladimir Putin's statements:
The head of the Russian state called the Chinese leader a dear friend and congratulated him on his re-election as President of the PRC.
▪️In recent years, China has made… https://t.co/zOFuSAorRp pic.twitter.com/inOercrO8n
ఏడాదికి పైగా ఉక్రెయిన్ తో రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు కీలక నగరాలు, రీజియన్లను రష్యా సొంతం చేసుకున్నప్పటికీ- ఉక్రెయిన్ సైనిక బలగాల ఎదురుదాడితో వాటిపై ఆధిపత్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అమెరికా సహా యూరోపియన్ యూనియన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్యదేశాలు అందిస్తోన్న ఆయుధ సంపత్తి, యుద్ధ సామాగ్రితో రష్యాను తీవ్రంగా ప్రతిఘటిస్తోంది ఉక్రెయిన్.
🇨🇳🤝🇷🇺"Welcome to Russia" — Xi Jinping has arrived in the Kremlin, an informal meeting with Vladimir Putin has started pic.twitter.com/BQ4rzfmynT
— AZ 🛰🌏🌍🌎 (@AZgeopolitics) March 20, 2023
ఈ నేపథ్యంలో- ఆసియాలో అత్యంత శక్తిమంతంగా భావిస్తోన్న చైనా.. తన మిత్రదేశం రష్యాకు మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్ఝి జిన్ పింగ్ నేరుగా రష్యాలో పర్యటిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. యుద్ధం సుదీర్ఘకాలం పాటు కొనసాగించాల్సిన పరిస్థితే ఎదురైతే- రష్యాకు అవసరమైన సహాయ, సహకారాలను అందజేయడానికి కూడా చైనా వెనుకాడకపోవచ్చు. అవే హామీలను ఈ సందర్భంగా జిన్ పింగ్.. పుతిన్ కు ఇవ్వొచ్చని అంటున్నారు.
Xi Jinping called Putin his "dear friend".
— Anton Gerashchenko (@Gerashchenko_en) March 20, 2023
Look at Putin's face. pic.twitter.com/WYcLYnknvP

దీనితో పాటు ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనలను కూడా జిన్ పింగ్ తెరమీదికి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఉక్రెయిన్ పీస్ ప్లాన్ (Ukraine Peace plan) ప్రతిపాదనలపై జిన్ పింగ్ చర్చించారని చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడితో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించి ఈ శాంతి ప్రతిపాదనలను కార్యాచరణలోకి తీసుకుని వచ్చే అంశాలపైనా చర్చిస్తారని టాస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.












Click it and Unblock the Notifications