వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరకొరియాను చూసి వణుకుతున్న అమెరికా! ఇంత తక్కువ వ్యవధిలో అంతటి సామర్థ్యమా?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఒకప్పుడు ఉత్తరకొరియాను 'ఉత్తుత్తికొరియా'గా అభివర్ణించింది అమెరికా. ఇప్పుడు అదే ఉత్తుత్తికొరియా అమెరికా పాలిట పీడకలగా మారింది. కారణం- అతి తక్కువ వ్యవధిలోనే ఉత్తరకొరియా సముపార్జించిన అణ్వాయుధ పాటవం.

కొద్ది నెలల్లోనే ఉత్తర కొరియా సాధించిన అణుపాటవంపై అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ ) డైరెక్టర్ మైక్ పాంపియో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరకొరియాను చాలా నిశితంగా గమనిస్తున్నామని తాజాగా ఆయన పేర్కొన్నారు.

అగ్రరాజ్యాన్నే ఢీకొనే స్థాయికి...

అగ్రరాజ్యాన్నే ఢీకొనే స్థాయికి...


క్షిపణి ప్రయోగాలు చేపట్టడం ఒక ఎత్తు అయితే... అగ్రరాజ్యం అమెరికానే ఢీకొనే స్థాయికి చేరుకోవడం మరొక ఎత్తు. ఇప్పుడు ఉత్తరకొరియా ఇదే చేసింది. ఎడాపెడా క్షిపణి ప్రయోగాలు జరిపి, ఏకంగా అమెరికానే సవాలు చేసే స్థాయికి ఎదిగింది. దీనికి సాక్ష్యం.. అత్యంత తక్కువ సమయంలో ఆ దేశం అణుపాటవాన్ని పెంపొందించుకోవడమే. దీనివెనుక ఉత్తరకొరియా శాస్త్రవేత్తల ఘనత ఉన్నప్పటికీ అసలు ఆ దేశానికి అణ్వాయుధాలను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఎలా అందిందో ఇప్పటికీ అంతుబట్టని విషయంగానే మిగిలిపోయింది. ఈ విషయంలో చైనా, పాకిస్తాన్‌లనే అమెరికా అనుమానిస్తోంది.

అమెరికాలో అదే కలవరం...

అమెరికాలో అదే కలవరం...

ఉత్తరకొరియాను ఒకప్పుడు ‘ఉత్తుత్తి కొరియా'గా అభివర్ణించిన అమెరికా ఇప్పుడు ఆ దేశం పేరు వింటేనే ఉలిక్కిపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుకొని ఆ దేశ నిఘా సంస్థ సీఐఏ అధినేత మైక్ పాంపియో వరకు అందరినీ ఉత్తరకొరియా ఎదుగుదలే ఆందోళనకు గురిచేస్తోంది. జస్ట్ కొన్ని నెలల్లోనే అమెరికాపైనే దాడిచేయగల సామర్థ్యాన్ని ఆ దేశం సాధించడంపై సర్వత్రా ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తమవుతున్నాయి.

ఆదినుంచీ వార్నింగ్ అందుకే...

ఆదినుంచీ వార్నింగ్ అందుకే...

ఉత్తరకొరియా నుంచి అగ్రరాజ్యం అమెరికాకు పొంచి ఉన్న ముప్పు గురించి సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. సీఐఏ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆయన తాజాగా బీబీసీకి పలు విషయాలు వెల్లడించారు. ఉత్తరకొరియా అణ్వాయుధ సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని ట్రంప్ ప్రభుత్వం పసిగట్టిందని, అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదిలోనే కిమ్‌కు హెచ్చరికలు పంపారని ఆయన పేర్కొన్నారు.

కొరియా సామర్థ్యాన్ని ‘కట్’ చేయాల్సిందే...

కొరియా సామర్థ్యాన్ని ‘కట్’ చేయాల్సిందే...

ఉత్తరకొరియా అణుపాటవం నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించాల్సిన కర్వ్యం తమపై ఉందని సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో తెలిపారు. ఈ ప్రత్యామ్నాయాలు దౌత్యేతర మార్గాల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఏదో ఒక విధంగా ఉత్తరకొరియా ప్రాభవాన్ని తగ్గించేందుకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటామని వ్యాఖ్యానించారు.

ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి...

ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి...

ఉత్తరకొరియాపై బలప్రయోగం వల్ల ఆ ప్రాంతంలో భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందనే విషయాన్ని అమెరికా ముందుగానే గుర్తించింది. ఆ ప్రాంతంలో అమెరికాకు మిత్రపక్షాలైన దక్షిణ కొరియా, జపాన్ ఉండడంతో యుద్ధమంటూ సంభవిస్తే జరిగే పరిణామాలను అధ్యక్షుడు ట్రంప్ ముందుగానే పసిగట్టారని, అందుకే ఆయన కిమ్‌ను పదవీచ్యుతుణ్ని చేయడం, లేదంటే అమెరికాపై దాడి చేయగల అణ్వాయుధ సామర్థ్యాన్ని కొంతమేరకే పరిమితం చేయడం వంటి ప్రత్యామ్నాయాలపై ద‌ృష్టి పెట్టారని సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో వెల్లడించారు.

English summary
The director of the CIA says he is worried that North Korea could have a nuclear missile capable of striking the US “in a matter of a handful of months”.Mike Pompeo, speaking to BBC News a year into his tenure, said that his intelligence agency regularly discusses the threat from Pyongyang and the North Korean leader Kim Jong-un. “We talk about him having the ability to deliver a nuclear weapon to the United States in a matter of a handful of months,” Mr Pompeo said, speaking in CIA headquarters in Virginia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X