వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురుషులకు కుటుంబ నియంత్రణ మాత్రలు .. బిల్ గేట్స్ సహాయంతో వైద్య రంగంలో కీలక ముందడుగు !!

|
Google Oneindia TeluguNews

ఔషధ రంగంలో గణనీయమైన అడుగులు పడ్డాయి. కేవలం మహిళలకు మాత్రమే గర్భనిరోధక విధానాలు అమల్లో ఉన్న పరిస్థితుల నుండి, పురుషులకు కూడా కుటుంబ నియంత్రణ మాత్రలు అందుబాటులోకి తీసుకువచ్చే పరిస్థితుల వరకు ప్రపంచ ఔషధ రంగం అభివృద్ధి చెందింది. ఇప్పటివరకు పురుషులకు కండోమ్ తర్వాత కుటుంబ నియంత్రణ సాధనాలే అందుబాటులోకి రాలేదు. కానీ సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన ఒక పెద్ద డెవలప్ మెంట్ లో భాగంగా పురుషులకు కుటుంబ నియంత్రణ మాత్రలు అందుబాటులోకి రానున్నాయి.

భారత్ కు పెరుగుతున్న కరోనా పరేషాన్ : 44,643 కొత్త కేసులు, 4.14 లక్షల యాక్టివ్ కేసులు !!భారత్ కు పెరుగుతున్న కరోనా పరేషాన్ : 44,643 కొత్త కేసులు, 4.14 లక్షల యాక్టివ్ కేసులు !!

 పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రల తయారీకి బిల్ గేట్స్ సహకారం

పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రల తయారీకి బిల్ గేట్స్ సహకారం

పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రలు తయారీ కోసం బిల్ గేట్స్ తన సహాయ సహకారాలను అందిస్తున్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుండి 1.2 మిలియన్ల డాలర్ల నిధుల ప్రోత్సాహాన్ని అందుకున్న తర్వాత దుండి విశ్వవిద్యాలయ పరిశోధకులు పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మాత్ర మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే ఇది మాత్రమే మొట్టమొదటి సురక్షితమైన మరియు ప్రభావవంతమైన పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రగా భావించాలి.

దుండి యూనివర్సిటీలో వేగంగా జరుగుతున్న ఔషధ అభివృద్ధి

దుండి యూనివర్సిటీలో వేగంగా జరుగుతున్న ఔషధ అభివృద్ధి

పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రలను అభివృద్ధి చేయాలనే ఆలోచనను పరిశీలిస్తున్న అనేక సంస్థలలో స్కాట్ల్యాండ్ లోని దుండి విశ్వవిద్యాలయం ఒకటి. అయితే, చాలా సంవత్సరాలుగా ఈ పరిశోధనలో ఎలాంటి పురోగతి లేదు. మానవ స్పెర్మ్ బయాలజీని సరిగా అర్థం చేసుకోకపోవడం , పురుషుడి ద్వారా విడుదలైన వీర్యం తప్పనిసరిగా నిర్వహించాల్సిన కీలక విధులను కంట్రోల్ చేసే

 గర్భ ధారణ నుండి రక్షించే భారం కేవలం మహిళలపైనే : వెల్లడించిన పరిశోధకుడు క్రిస్ బారట్

గర్భ ధారణ నుండి రక్షించే భారం కేవలం మహిళలపైనే : వెల్లడించిన పరిశోధకుడు క్రిస్ బారట్

దుండీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పునరుత్పత్తి మెడిసిన్ ప్రొఫెసర్ క్రిస్ బారట్ బిల్ గేట్స్ ఈ మాత్రను తయారుచేసేందుకు ఇస్తున్న ప్రోత్సాహక నిధులపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో ఇలా పంచుకున్నారు, కండోమ్ అభివృద్ధి చేసినప్పటి నుండి పురుషుల గర్భనిరోధక రంగంలో గణనీయమైన మార్పు లేదు. దీని అర్థం అవాంఛిత గర్భధారణ నుండి రక్షించే భారం చాలా వరకు మహిళలపై పడుతోంది. ఆ అసమానతను పరిష్కరించాలని తాము ఆశిస్తున్నామని వెల్లడించారు. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుండి మా మునుపటి రౌండ్ నిధులకు ధన్యవాదాలు, మేము ఇప్పటికే పురోగతి సాధించాము. మరో రెండేళ్లలో పురుషులకు కుటుంబ నియంత్రణ మాత్రలు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.

మరో రెండేళ్లలో పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రలు అందుబాటులోకి

మరో రెండేళ్లలో పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రలు అందుబాటులోకి

స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పురుషుల సంతానోత్పత్తి పరిశోధనలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మా నైపుణ్యాన్ని, మా స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లోని ఔషధాల రూపకల్పనలో జ్ఞానాన్ని కలిపి, ఈ పరిశోధనను కొనసాగించడానికి దుండి ప్రత్యేకంగా సిద్ధమైందని వెల్లడించారు . ఈ రెండేళ్ల వ్యవధి ముగిసే సమయానికి, మేము ఔషధ అభివృద్ధిలో ప్రగతి సాధిస్తామన్నారు. పురుషుల గర్భనిరోధకంలో కొత్త శకాన్ని అన్‌లాక్ చేసే ప్రక్రియలో ఇది కీలకమైందని ఆయన వెల్లడించారు. ఆర్థిక ప్రోత్సాహం పరిశోధకులకు మరిన్ని పరీక్షలు కొనసాగించడానికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రలు అందుబాటులోకి రావొచ్చని ఆయన వెల్లడించారు.

English summary
Significant steps have been taken in the field of medicine. The global pharmaceutical industry has evolved from a system where contraceptives are only available to women, to family planning pills for men as well. So far no family planning tools have been made available to men after condom. But family planning pills for men are becoming available as part of a larger development that has taken place over a long period of time. Bill Gates is financing the development of these tablets, and dundi university is developing this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X