వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా రోగుల్లో దీర్ఘకాలిక అనారోగ్యం ..కొత్త కరోనా వేరియంట్ల పుట్టుకకు కేంద్రం అంటున్న శాస్త్రవేత్తలు

|
Google Oneindia TeluguNews

కరోనా పాజిటివ్ వచ్చింది .. ఓ పదిహేను రోజుల తర్వాత నెగిటివ్ వచ్చింది .. అయినా కాస్త అనారోగ్యంగానే ఉంటుంది . తరచూ జలుబు ,దగ్గు , కాళ్ళు నొప్పులు , ఒళ్ళు నొప్పులు ఇలా ఏదో ఒక సమస్య వేధిస్తుంది అనుకునే వారికి షాకింగ్ విషయాన్ని చెప్పారు శాస్త్రవేత్తలు . కరోనా మహమ్మారి సోకి చాలా కాలంపాటు తగ్గకుండా ఇబ్బంది పడిన వారిలో కరోనా కొత్త జన్యు రకాలను సృష్టిస్తుంది అని ఒక అధ్యయనంలో కనుగొన్నారు. కరోనా సోకిన దీర్ఘ కాల రోగులు ఈ ఉత్పరివర్తనలకు కేంద్రంగా మారతారని స్పష్టం చేశారు

కరోనా వ్యాక్సిన్ తీసుకునే మందుబాబులకు షాకింగ్ న్యూస్ .. 45 రోజులు నో లిక్కర్ అంటున్న నిపుణులుకరోనా వ్యాక్సిన్ తీసుకునే మందుబాబులకు షాకింగ్ న్యూస్ .. 45 రోజులు నో లిక్కర్ అంటున్న నిపుణులు

 అమెరికాకు చెందిన కరోనా సోకిన ఒక రోగి కేసుపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు

అమెరికాకు చెందిన కరోనా సోకిన ఒక రోగి కేసుపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్మూలనకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 22 లక్షలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు జాన్ హాప్కిన్స్ కరోనా వైరస్ రిసోర్స్ సెంటర్ పేర్కొంది.

కరోనాను నిర్మించడం కోసం వ్యాక్సిన్లను తయారుచేసిన ఫార్మా కంపెనీలు తాము తయారు చేసిన వ్యాక్సిన్లు యూకే కరోనా వేరియంట్, దక్షిణాఫ్రికాలో కనిపించే కరోనా వైరస్ యొక్క ఉత్పరివర్తనల జాతుల నుండి కూడా ప్రజలను రక్షించగలవని పేర్కొంటున్న సమయంలో అమెరికాకు చెందిన కరోనా సోకిన ఒక రోగి కేసు ప్రస్తుతం అందరినీ షాక్ కు గురి చేసింది.

కరోనా సోకి చాలా నెలలు పోరాడిన వ్యక్తిలో కరోనా కొత్త వేరియంట్

కరోనా సోకి చాలా నెలలు పోరాడిన వ్యక్తిలో కరోనా కొత్త వేరియంట్


45 సంవత్సరాల కరోనా పాజిటివ్ సోకి చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వ్యక్తి బోస్టన్ లోని బ్రిఘం మరియు విమెన్ ఆసుపత్రిలో చేరారు . గత సంవత్సరం మార్చి నెలలో కోవిడ్ -19 కు పాజిటివ్ కు గురయిన సదరు వ్యక్తి చాలా నెలలు వైరస్ తో పోరాడిన అనంతరం మరణించారు, కాని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయేలా, భయపడేలా ఉన్నఅతని కేస్ ఫైల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోగి యాంటిఫాస్ఫోలిడ్ సిండ్రోమ్ అని పిలువబడే అరుదైన రుగ్మతతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు .

 అతని రోగనిరోధక శక్తినే తన సొంత అవయవాలపై దాడి చేయడానికి ప్రేరేపించిందని గుర్తించిన శాస్త్రవేత్తలు

అతని రోగనిరోధక శక్తినే తన సొంత అవయవాలపై దాడి చేయడానికి ప్రేరేపించిందని గుర్తించిన శాస్త్రవేత్తలు

ఇది అతని రోగనిరోధక శక్తినే తన సొంత అవయవాలపై దాడి చేయడానికి ప్రేరేపించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు .
కోవిడ్ -19 కి రోగి చికిత్స పొందుతున్న 154 రోజులలో, అతని శరీరంలోని వైరస్ అనేకసార్లు పరివర్తన చెందిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నివేదిక ప్రకారం, మ్యుటేషన్ వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ మీద కేంద్రీకృతమై ఉంది. కోవిడ్ -19 వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్‌లో ఈ రకమైన జన్యు మార్పు యూ కె జాతిలో 'N501Y' గా పిలువబడుతోంది . ఈ ఉత్పరివర్తన జాతి 50 శాతం కరోనా వైరస్ ను అదనంగా వ్యాప్తి చేసే అవకాశం ఉంది.

దీర్ఘకాలం కరోనాతో పోరాడితే కొత్త వైరస్ రకాల పుట్టుకకు కారణం అవుతారన్న శాస్త్రవేత్తలు

దీర్ఘకాలం కరోనాతో పోరాడితే కొత్త వైరస్ రకాల పుట్టుకకు కారణం అవుతారన్న శాస్త్రవేత్తలు


అయితే ఈ కేసును బట్టి కోవిడ్ 19 సోకిన రోగులు ఎక్కువకాలం అనారోగ్యంతో బాధ పడుతూ ఉంటే, వారు కరోనా వైరస్ కొత్త రకాల పుట్టుకకు కారణం అవుతారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా కరోనాతో పోరాడిన వ్యక్తి శరీరంలో జరిగిన మ్యూటేషన్ కూడా అలాంటిదే. ఈ మ్యూటేషన్ ను అతని రోగ నిరోధక శక్తి తన సొంత అవయవాలపై దాడి చేయడానికి ప్రేరేపించి ఉంటుందని గుర్తించారు. ఇక ఈ తరహా ఉత్పరివర్తనలు జరిగితే వాటిని టీకాలు కూడా నిరోధించలేవు అనేది శాస్త్రవేత్తల ఆందోళన.

దీర్ఘకాల కరోనా మ్యూటేషన్ రకాలను వ్యాక్సిన్ కూడా నిరోధించలేదు

దీర్ఘకాల కరోనా మ్యూటేషన్ రకాలను వ్యాక్సిన్ కూడా నిరోధించలేదు

కరోనా వైరస్ సోకిన తర్వాత పాజిటివ్ నుంచి కరోనా వైరస్ నెగిటివ్ గా మారినప్పటికీ, తరచుగా అనారోగ్యాలు కలుగుతూ ఉంటే అప్రమత్తంగా ఉండడం అవసరం. శరీరంలో ఉన్న వైరస్ బయటకు నెగటివ్ గా కనిపించినా లోపల ఉత్పరివర్తనలు జరిగే ప్రమాదం ఉందన్నది శాస్త్రవేత్తల ఆందోళన.
ఇక ఇలాంటి మార్పులు టీకాలను కూడా నిరాయుధంగా చేస్తుందన్నది వారి వాదన .

Recommended Video

#APpanchayatelections: Candidates Election Expense Limit ఎన్నికల్లో ఖర్చు చేయాల్సింది ఎంతో తెలుసా.!

English summary
Corona came positive .. Fifteen days later came negative .. However is still slightly ill. Scientists say it's a shocking thing for those who think that something like frequent colds, coughs, leg pains, and back pains plague them. A study has found that the corona creates new genetic variants in people who have been suffering from the corona pandemic for a long time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X