ఆ విమానాశ్రయంలో కరోనా పరీక్షలు .. 10 నిముషాల్లోనే రిపోర్టులు
ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ కరోనా విషయంలో ఒక అడుగు ముందుకేసింది . ఇక విమానాశ్రయంలోనే ప్రయాణికుల కోసం కరోనా పరీక్షల సదుపాయాన్ని ప్రారంభించింది. దుబాయ్ విమానాశ్రయం నుంచి ఎమిరేట్స్ విమానాలు టేకాఫ్ అయ్యే ముందు ప్రతి ప్రయాణికుడికి కరోనా పరీక్ష నిర్వహిస్తారు. ఇక పరీక్షల ఫలితాలు కూడా పది నిమిషాల్లోనే వస్తాయి. దీంతో ఎవరికైనా కరోనా ఉందని నిర్ధారణ అయితే కరోనా పాజిటివ్ ఉన్న వారిని విమానంలోకి అనుమతించకుండా వారిని ఐసోలేషన్ కు తరలిస్తారు .
ఇక దుబాయ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ఈ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది .అరబ్ దేశాల్లో ఇప్పటివరకు దాదాపు 5వేల మందికి కరోనా సోకగా 28మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌తో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఎమిరేట్స్ విమనాలను నడుపుతోంది. అయితే అవి కూడా లాక్‌డౌన్ కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన విదేశీయులను స్వదేశం వెళ్లడానికి మాత్రమే అనుమతిస్తున్నారు.

ప్రస్తుతం అక్కడ ఉన్న విదేశీయులు వారి స్వదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసమే ఈ సర్వీసులను నడుపుతున్నట్టు ఎమిరేట్స్ చెప్తుంది . దీనిలో భాగంగా తొలుత దుబాయి నుంచి టునీషియా వెళ్లిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక స్వదేశాలకి తరలించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరీక్షించిన తరువాతే వారిని విమానాల్లో అనుమతిస్తున్నారు .
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications