వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: చైనాలో మరో రికార్డు - గ్లోబల్‌గా 2.5 కోట్లు దాటిన కేసులు - ట్రంప్ సభల్లో నో మాస్క్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి భూగోళాన్ని చుట్టుముట్టి 10 నెలలు గడుస్తున్నా.. దాని ప్రభావం కొంచెం కూడా తగ్గలేదు. ఎపిసెంటర్లు మారుతున్నాయే తప్ప, వైరస్ వ్యాప్తి యథావిథిగా కొనసాగుతున్నది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల లెక్కల ప్రకారం ఆదివారం నాటికి గ్లోబల్ గా మొత్తం కేసుల సంఖ్య 2.5 కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కాటుకు బలైపోయినవారి సంఖ్య 8.47లక్షలకు పెరిగింది. మొత్తం కేసుల్లో 17.54మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దేశాల వారీగా చూస్తే కరోనా పుట్టినిల్లు చైనా సరికొత్త రికార్డు నెలకొల్పింది..

 14 రోజులుగా కేసులు లేవు..

14 రోజులుగా కేసులు లేవు..

కరోనా జన్మస్థలమైన చైనాలో వైరస్ వ్యాప్తి దాదాపుగా కంట్రోల్ లోకి వచ్చిందని, తాజాగా 9 కేసులు వెలుగులోకి రాగా, వారంతా బయటి దేశాల నుంచి వచ్చినవాళ్లేనని, గడిచిన 14 రోజులుగా లోకల్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్‌హెచ్‌సీ) ఆదివారం ప్రకటించింది. ఇంతకుముందు, (మే 24 నుంచి జూన్ 5 వరకు) 13 రోజులపాటు ఒక్కలోకల్ కేసు కూడా రాలేదు. ఆదివారంనాటి ప్రకటనతో జీరో కేసుల్లో చైనా రికార్డు సాధించినట్లయింది. ఇప్పటిదాకా చైనాలో మొత్తం 85,031 కేసులు నమోదుకాగా, అందులో 80,153మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మొత్తం 4,634 మంది మహమ్మారికి బలైపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 244గా ఉంది. వీళ్లంతా బయటి దేశాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.

న్యూజిలాండ్‌లో మళ్లీ సడలింపులు

న్యూజిలాండ్‌లో మళ్లీ సడలింపులు

ప్రపంచంలో కరోనాను జయించిన మొట్టమొదటి దేశంగా, ఏకంగా 100 రోజులపాటు అన్ లాక్ లో గడిపి రికార్డు సృష్టించింది ద్వీపదేశం న్యూజిలాండ్. అయితే, మూడు వారాల కిందట ఆక్లాండ్ లో మళ్లీ కొత్త కేసులు రావడంతో ఆంక్షలు విధించారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తిరిగి కంట్రోల్ లోకి రావడంతో మరోసారి ఆంక్షల సడలింపులు ప్రకటించారు. సోమవారం నుంచి ఆక్లాండ్ లో నిషేధాజ్ఞలు ఉండబోవని ప్రధాని జెసిండా తెలిపారు. ఇక ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ లో వరుసగా మూడో రోజు 100కుపైగా కొత్త కేసులు రావడంతో సడలింపులకు ప్రభుత్వం నో చెప్పింది. ఆస్ట్రేలియాలో మొత్తంగా 25,670 కేసులు నమోదుకాగా, 21,116 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 611 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,943గా ఉంది.

Recommended Video

#IndiaChinaFaceOff : డోక్లామ్ ట్రైజంక్షన్ వద్ద క్షిపణి ప్రయోగానికి అవసరమైన బేస్ స్టేషన్లు!!
ట్రంప్ సభల్లో నో మాస్క్..

ట్రంప్ సభల్లో నో మాస్క్..


కరోనా కేసులు, మరణాల్లో గ్లోబల్ మాస్టర్ గా కొనసాగుతోన్న అమెరికాలో సాక్ష్యాత్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల సభల్లోనే నిబంధనలు ఉల్లంఘిస్తుండటం గమనార్హం. రిపబ్లిక్ అభ్యర్థిగా ట్రంప్ ను అధికారికంగా ప్రకటించే కార్యక్రమంలోనూ అతి కొద్ది మంది మాత్రమే మాస్కులు ధరించారు. ట్రంప్ ఎన్నికల సభల్లో సోషల్ డిస్టెన్స్ నిబంధనల్ని పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో రికార్డు స్థాయిలో 61.4లక్షల పాజిటివ్ కేసులు, 1.86లక్షల మరణాలు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 34.08 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 2.5 లక్షలుగా ఉంది.

English summary
As the coronavirus pandemic is set to enter its 10th month, cases around the world surpassed the 25 million mark on Sunday according to a Reuters tally. Till now the virus has caused the deaths of at least 840,000 people. After reporting 9 new coronavirus cases, all imported on Saturday, China marked 14 days without any local transmission, the National Health Commission said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X