వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19 వ్యాక్సీన్: మొత్తం టీకాల్లో సగానికిపైగా చైనా నుంచే వచ్చాయా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బీజింగ్ సైనోఫార్మ్ ప్లాంట్

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన కోవిడ్-19 వ్యాక్సీన్లలో సగం తామే సరఫరా చేసినట్లు చైనా చెబుతోంది. చైనా చేస్తున్న ఈ వాదనను బీబీసీ రియాలిటీ చెక్ పరిశీలించింది.

చైనా వాదనేంటి?

ప్రపంచంలోని వ్యాక్సీన్లలో సగం టీకాలు చైనా నుంచే వచ్చాయని సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక వీడియోలో కమ్యూనిస్ట్ పార్టీ యూత్ లీగ్ పేర్కొంది.

ఈ వీడియోను సెప్టెంబరు నెలాఖరులో వీబో (చైనా సోషల్ మీడియా వేదిక)లో పోస్టు చేశారు. అప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 6 బిలియన్ (600 కోట్ల) వ్యాక్సీన్ డోసులు ఇచ్చారని 'అవర్ వరల్డ్ ఇన్ డేటా' వెబ్‌సైట్ చెబుతోంది.

దీని ప్రకారం చైనా దేశీయ అవసరాల కోసం, విదేశీ ఎగుమతుల కోసం కలిపి మొత్తం 3 బిలియన్ (300 కోట్ల) వ్యాక్సీన్ డోసులను సరఫరా చేసిందా?

సెప్టెంబరు 27నాటికి 2.2 బిలియన్ (220 కోట్ల) వ్యాక్సీన్ డోసులను ఇవ్వడం పూర్తి చేసినట్లు చైనా చెబుతోంది.

వ్యాక్సీన్లను ఎగుమతి చేస్తున్న ప్రధాన దేశాల్లో చైనా కూడా ఒకటి. వాణిజ్యపరంగానూ విక్రయిస్తోంది. విరాళంగానూ పంపిస్తోంది.

వ్యాక్సీన్ తయారీకి అవసరమైన ముడి సరుకులను కూడా చైనా పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తోంది. వాటి ప్యాకేజింగ్, తయారీ ప్రక్రియ పనులను వాటిని దిగుమతి చేసుకున్న దేశాలు చూసుకుంటాయి.

సెప్టెంబరు 27 నాటికి ఒక్క చైనాలోనే 2.2 బిలియన్ (220 కోట్ల) వ్యాక్సీన్ డోసులను ఇచ్చామని ఆ దేశం చెబుతోంది.

"1.2 బిలియన్ (120 కోట్ల) డోసులను 100కి పైగా దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు సరఫరా చేసినట్లు సెప్టెంబరు 23న చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.

కోవిడ్ టీకా

చైనా ఎగుమతులను నిర్ధరించగలమా?

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన వ్యాక్సీన్లను ఎయిర్‌ఫినిటీ అనే డేటా అనలిటిక్స్ సంస్థ ట్రాక్ చేస్తోంది. చైనా వాణిజ్యపరంగా అక్టోబరు 8 నాటికి 1.1 బిలియన్ (110 కోట్ల) డోసులను 123 దేశాలకు ఎగుమతి చేసినట్లు ఈ సంస్థ పేర్కొంది. ఇందులో చైనా పూర్తిగా తయారు చేసిన వ్యాక్సీన్ డోసులతో పాటు టీకా తయారీకి అవసరమైన ముడి పదార్థాలను కలిపి ఈ లెక్క గట్టారు.

అందులో సుమారు 10.1 మిలియన్ (1.1 కోట్ల) డోసులను.. కోవ్యాక్స్ గ్లోబల్ వ్యాక్సీన్ షేరింగ్ పథకం పేద దేశాలకు వ్యాక్సీన్లను సరఫరా చేసేందుకు కొనుగోలు చేసింది.

37 మిలియన్ (30.7 కోట్ల) వ్యాక్సీన్లను చైనా విరాళంగా సరఫరా చేసినట్లు ఐక్యరాజ్యసమితి డేటా చెబుతోంది. చైనా 50.2 కోట్ల వ్యాక్సీన్లను సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది.

బుటాన్‌టాన్ ప్రొడక్షన్ సెంటర్

చైనా ఎగుమతి చేశామని చెబుతున్న 1.2 బిలియన్ (120కోట్ల) వ్యాక్సీన్ డోసుల సంఖ్య కాస్త ఎక్కువ చేసి చెబుతున్నట్లుగానే కనిపిస్తోంది. కానీ, ఈ లెక్కలు చైనా కాకుండా ఇతర దేశాలన్నీ కలిపి సరఫరా చేసిన వ్యాక్సీన్ల మొత్తంతో సరిపోతున్నాయి.(1.138 బిలియన్)

ఒక్క చైనానే 2.2 బిలియన్ (220కోట్ల) వ్యాక్సీన్ డోసులను సరఫరా చేస్తే, ప్రపంచ వ్యాప్తంగా వాడిన వ్యాక్సీన్లలో సగం టీకాలు చైనా ఇచ్చినట్లే. అయితే ఎగుమతి అయిన డోసులను ఎంత వరకు వినియోగించారనే విషయంపై స్పష్టత లేదు.

వ్యాక్సీన్ ఎగుమతుల కోసం చైనా ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలలో భాగంగా టీకాలను ఆ దేశాల్లో కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

ఉదాహరణకు చైనా సరఫరా చేసే పదార్ధాలను వాడి స్థానికంగా వ్యాక్సీన్లను ఉత్పత్తి చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్చిలో ఒప్పందం కుదుర్చుకుంది.

ఆస్ట్రాజెనెకా వైద్య సాంకేతికతను ఉపయోగించి బ్రెజిల్ సంస్థ బయో మాంగ్విన్ హోస్ /ఫైయోక్రజ్ 10 కోట్లకు పైగా వ్యాక్సీన్ డోసులను ఉత్పత్తి చేసింది. వ్యాక్సీన్ తయారీ కోసం చైనా సంస్థ వుక్సీ బయోలాజిక్స్ సరఫరా చేసిన పదార్ధాలను వాడింది.

ఇతర దేశాల పరిస్థితి?

చైనా అక్టోబరు 6 నాటికి 2.2 బిలియన్ (220 కోట్ల) వ్యాక్సీన్ డోసులను ఇవ్వడం పూర్తి చేసింది. భారతదేశంలో అప్పటికి 923.5 మిలియన్ డోసులు, యూరోపియన్ యూనియన్ 571.4 మిలియన్ డోసులు, యూఎస్ 398.7 మిలియన్ డోసులను ఇవ్వడం పూర్తి చేసినట్లు అవర్ వరల్డ్ ఇన్ డేటా చెబుతోంది.

యూరోపియన్ ఎకనామిక్ ఏరియా దేశాల(యురోపియన్ యూనియన్ దేశాలతో పాటు ఐస్‌లాండ్ , లిక్‌టెన్‌స్టైన్, నార్వే)లతో కలిపి ఇప్పటి వరకు 853,015,179 డోసులను ఎగుమతి చేసినట్లు ఎయిర్‌ఫినిటీ డేటా తెలియజేస్తోంది. అమెరికా 178,592,930 డోసులను సరఫరా చేసింది.

ఇందులో యుఎస్, ఈయూలు విరాళంగా ఇచ్చిన డోసులు కూడా ఉన్నాయి. అయితే, ఈ రెండు దేశాలూ వ్యాక్సీన్ తయారీకి అవసరమైన మూల పదార్ధాలను మాత్రం తమ దేశం దాటి బయటకు పంపించవు. అంటే, ఈ లెక్కలు పూర్తిగా తయారు చేసిన టీకాల సంఖ్యను మాత్రమే సూచిస్తున్నాయి.

మే చివరి నాటికి భారతదేశం 66.4 మిలియన్ (6.64 కోట్ల) డోసులను ఎగుమతి చేసింది.

రష్యా కూడా తమ వ్యాక్సీన్‌ను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. కానీ, నిజానికి రష్యా చేసిన ఎగుమతులపై స్పష్టత లేదు.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్ ఉత్పత్తి పెరుగుతోంది. పెద్ద సంస్థలు ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నాయి.

డిసెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా 12.2 బిలియన్ (1202 కోట్ల) డోసుల వ్యాక్సీన్లను ఉత్పత్తి చేస్తారని ఎయిర్‌ఫినిటీ అంచనా వేస్తోంది. అందులో 5.7 బిలియన్ (570 కోట్ల) టీకాలు చైనాకు చెందినవి కాగా, మిగిలినవి ఇతర దేశాలకు చెందినవి.

కానీ, సంపన్న దేశాల్లో వ్యాక్సీన్ నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయని ఎయిర్‌ఫినిటీ పేర్కొంది. ఎగుమతి చేశామని చెబుతున్న డోసుల సంఖ్య వినియోగించిన డోసుల సంఖ్య ఒకటి కాదు.

కొన్ని దేశాల్లో మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది కొరత లాంటి ఇతర సమస్యల వల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆటంకంగా మారాయి.

పేద దేశాల్లో, ముఖ్యంగా ఆఫ్రికాలో ఇటువంటి అంశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఎటువంటి ప్రభావం చూపాయో కూడా మేము పరిశీలించాం.

అదనపు రిపోర్టింగ్: కుమార్ మల్హోత్రా

రియాలిటీ చెక్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Covid-19 vaccine: More than half of all vaccines come from China
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X