వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ వ్యాక్సిన్ పరిహార పథకం .. కీలక ప్రకటన చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

|
Google Oneindia TeluguNews

ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని కోవిడ్ వ్యాక్సిన్ పరిహార పథకం కోవిడ్ వ్యాక్సిన్ల నుండి ఏవైనా దుష్ప్రభావాలకు గురయ్యే పేద దేశాలలో ప్రజలకు పరిహార నిధిని ఏర్పాటు చేస్తోంది. ఇది ప్రపంచవ్యాప్త వ్యాక్సిన్ వినియోగంపై భయాలను తొలగించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తుంది . గ్లోబల్ వ్యాక్సిన్ కూటమి అయిన డబ్ల్యూహెచ్‌ఓ, గావి సహకారంతో కోవాక్స్ వ్యాక్సిన్ యొక్క ప్రమోటర్లు ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారని కోవాక్స్ ప్రకటించింది .

Recommended Video

COVID-19 Vaccine వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వారికి పరిహారం చెల్లిస్తాం! - WHO

కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక .. ప్రతి పది మందిలో ఒకరికి కరోనాకరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక .. ప్రతి పది మందిలో ఒకరికి కరోనా

వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు వస్తే పరిహారం చెల్లించేలా నిర్ణయం

వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు వస్తే పరిహారం చెల్లించేలా నిర్ణయం

వచ్చే ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా కనీసం 2 బిలియన్ల ప్రభావవంతమైన వ్యాక్సిన్ లను పంపిణీ చేయాలని కోవాక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. 92 తక్కువ ఆదాయ దేశాలకు, ఎక్కువగా ఆఫ్రికా మరియు ఆగ్నేయ ఆసియాలో ఈ వ్యాక్సిన్ పరిహార పథకాన్ని అందించనున్నారు. ఈ భీమా పథకం ప్రకారం కోవాక్స్ పంపిణీ చేసిన వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏదైనా అనుకోకుండా తప్పు జరిగితే వారికి వ్యాక్సిన్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు వస్తే వారికి పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది .

92 పేద దేశాలకు మాత్రమే పథకం వర్తింపు ..

92 పేద దేశాలకు మాత్రమే పథకం వర్తింపు ..

అయితే దక్షిణాఫ్రికా, లెబనాన్, గాబన్, ఇరాన్ మరియు చాలా లాటిన్ అమెరికన్ రాష్ట్రాలు వంటి మధ్య-ఆదాయ దేశాలకు ఈ రక్షణ ఇవ్వబడదని స్పష్టం చేసింది. కోవాక్స్ ఫెసిలిటీ 92 దేశాలలో పరిహారం అందించే వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది . రెగ్యులేటరీ ఆమోదం పొందిన టీకా నుండి ప్రతికూల ప్రభావాలు చాలా అరుదుగా ఉన్నప్పటికీ, కరోనా వ్యాక్సిన్ షాట్ల గురించి ప్రజల ఆందోళన పెరిగింది. దీంతో భీమా నిధిని ఏర్పాటు చేయడం ద్వారా వ్యాక్సిన్ వాడకంపై భయాలు, సందేహాలు తొలగిపోతాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది .

వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు .. ప్రజలకు సేఫ్టీ ప్రభుత్వం ఇస్తేనే వ్యాక్సిన్ ల పంపిణీ

వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు .. ప్రజలకు సేఫ్టీ ప్రభుత్వం ఇస్తేనే వ్యాక్సిన్ ల పంపిణీ

అంతర్జాతీయంగా ఆమోదించబడిన కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇంకా రాలేదు, కాని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం మొదటిది డిసెంబరు నాటికి సిద్ధంగా ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ పరిహార పథకం కింద, కోవాక్స్ వ్యాక్సిన్లను ఉపయోగించే దేశాలు కనీసం 2022 జూలై వరకు వ్యాక్సిన్ తయారీదారులకు నష్టపరిహారం ఇస్తాయి. టీకాల తయారీదారులు తమకు సేఫ్టీ , సెక్యూరిటీ అందించని దేశాలలో వ్యాక్సిన్లు పంపిణీ చెయ్యబోమని కోవాక్స్ తెలిపింది. సాధారణంగా ఈ ఖర్చులను భీమా చేసే బీమా సంస్థలకు బదులుగా, దుష్ప్రభావాల బాధితులకు పరిహారం కోవాక్స్ రూపొందించిన కొత్త విధానం ద్వారా చెల్లించబడుతుంది.

English summary
A vaccine scheme co-led by the World Health Organisation is setting up a compensation fund for people in poor nations who might suffer any side-effects from COVID-19 vaccines, aiming to allay fears that could hamper a global rollout of shots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X