మిరాకిల్ : "పురుషాంగం కాపాడిన ప్రాణం.."

Subscribe to Oneindia Telugu

క్రొయేషియా : సైంటిఫిక్ విషయాలెప్పుడూ విస్మయం కలిగించేవిగానే ఉంటాయి. లేకపోతే పిడుగుపాటుకు గురైన వ్యక్తి బ్రతికి బట్ట కట్టడమంటే మామూలు విషయం కాదు. క్రొయేషియాలో పిడుగుపాటుకు గురైన ఓ సైక్లర్ ను అతని పురుషాంగమే కాపాడింది. సైంటిఫిక్ గా జరిగిన ఈ ప్రక్రియలో మొత్తానికి ఆ వ్యక్తి ప్రాణాలను అతని పురుషాంగమే నిలబెట్టింది.

సాధారణంగా హైవోల్టేజ్ విద్యుత్ ప్రసారమైనప్పుడు వోల్టోజ్ నియంత్రించడానికి ఎర్తింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు ఇళ్లలో ఉపయోగించే టీవీలు, వాషింగ్ మెషీన్, వంటి వాటిల్లో ఎర్త్ సౌకర్యం ఉంటుంది. హైవోల్టేజీ ప్రసారమైన సందర్బాల్లో ఆ ఎర్త్ ద్వారా హైవోల్టేజీ బయటకు పంపించబడి వోల్టేజీ నియంత్రించబడుతుంది.

 Cyclist ‘is saved by his penis’ after he is struck by lightning and the bolt 'earths itself through his genitals'

క్రొయేషియాకు చెందిన జొరాన్ జుర్కోవిక్ (41) కు ఎదురైన అనుభవం కూడా అచ్చు ఇలాంటిదే. క్రొయేషియాలోని పెట్రోవ్ అనే ప్రాంతంలో జుర్కోవిక్ సైకిల్ మీద వెళుతుండగా పిడుగుపాటుకు గురయ్యాడు. అయితే ఆ సమయంలో అతను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండడం అతనికి కలిసొచ్చింది. ఇయర్ ఫోన్స్ వల్ల హైవోల్టేజీ విద్యుత్ అంతా హెడ్ ఫోన్స్ కేబుల్ ద్వారా కిందకు ప్రయాణించి, చివరకు అతని పురుషాంగం నుంచి బయటకు వెళ్లిపోయింది.

అంటే, ఇక్కడ సదరు వ్యక్తి పురుషాంగం హైవోల్టేజీని బయటకు పంపించడానికి ఎర్త్ గా ఉపయోగిపడిందన్న మాట. దీంతో అతను అతి స్వల్ప గాయాలతో పిడుగుపాటు నుంచి బయటపడ్డాడు. డాక్టర్లను సైతం విస్మయానికి గురిచేసిన ఈ క్రొయేషియా ఘటన ఇప్పుడు ప్రపంచమంతటా వైరల్ న్యూస్ గా మారిపోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Doctors have hailed a man's penis a miracle after his genitals saved his life after he was struck by lightning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి