నా వ్యక్తిగత ఆనందం కోసమే మూడో పెళ్లి, భారత్‌కు రహస్యాలు చెప్పానా: ఇమ్రాన్ ఖాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

కరాచీ: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌, ప్రతిపక్ష తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ అధ్యక్షులు ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో పెళ్లి చేసుకున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందించారు. తాను ఇంకా మూడోపెళ్లి చేసుకోలేదని, కానీ పెళ్లి ప్రతిపాదన మాత్రం చేసినట్లు వెల్లడించారు.

ఆయన వివరణ ఇచ్చిన తర్వాత కూడా పెళ్లి వార్తల ప్రచారం జోరుగా సాగుతంది. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన మండిపడ్డారు. ఇంత ప్రచారం జరగడం ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 నేనేం చేశా, ఆశ్చర్యపోతున్నా

నేనేం చేశా, ఆశ్చర్యపోతున్నా

మూడు రోజులుగా వస్తున్న వార్తలను చూసి ఆశ్చర్యపోతున్నానని, తాను ఏమైనా బ్యాంకులో దొంగతనం చేశానా లేదా జాతీయ సంపద దోచుకున్నానా లేదంటే పాకిస్తాన్ రహస్యాలను అన్నింటినీ భారత్‌కు చెప్పానా, ఇందులో నేనేమీ చేయలేదు అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

 నా బాధ అంతా వారి గురించే

నా బాధ అంతా వారి గురించే

మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, దానినే పెద్ద నేరంగా చూస్తున్నారు ఎందుకో అర్థం కావడం లేదని, తన గురించి ఆలోచించుకుండా ఈ మీడియా దీనిపై ఎందుకు ఇంత ప్రచారం చేస్తోందని, కానీ తన బాధంతా తన పిల్లలు, బుష్రా బేగం కుటుంబం గురించే అని చెప్పారు.

 షరీఫ్ కుటుంబ రహస్యాలను బయటపెట్టట్లేదు

షరీఫ్ కుటుంబ రహస్యాలను బయటపెట్టట్లేదు

వార్తలలోకి తమను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై కూడా ఇమ్రాన్‌ స్పందించారు. వారు వెనుకుండి తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నవాజ్‌ కుటుంబం తనకు నలభై ఏళ్లుగా తెలుసని, వారి కుటుంబ రహస్యాలను తాను బయటపెట్టట్లేదుగా అన్నారు.

 వ్యక్తిగత ఆనందం కోసమే పెళ్లి

వ్యక్తిగత ఆనందం కోసమే పెళ్లి

వ్యక్తిగత ఆనందం కోసమే తాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని, ఆ హక్కు తనకు ఉందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఇమ్రాన్‌ ఖాన్‌ రహస్యంగా మూడోపెళ్లి చేసుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఇమ్రాన్‌ తొలుత ఈ వార్తలు ఖండించారు. బుష్రా అనే మహిళకు తాను పెళ్లి ప్రతిపాదన చేసినట్లు చెప్పారు. అయితే ఆమె కొంచెం సమయం కోరారని, అంగీకారం లభిస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Annoyed by the "gutter media campaign" against his plan to get married for a third time, Pakistan's flamboyant cricketer-turned-politician Imran Khan on Tueday asked whether he had "sold" state secrets to India or "laundered" the country's wealth to deserve a bad press.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి