ఇరాన్ అణు స్థావరాల్ని అమెరికా దెబ్బతీయలేకపోయిందా ? ఇంటెల్ షాకింగ్ రిపోర్ట్-ట్రంప్ ఫైర్..!
ఇరాన్ తో తమ అణు చర్చలు విఫలం కాగానే ఇజ్రాయెల్ తో ఆ దేశంపై దాడి చేయించిన అమెరికాకు ఆ తర్వాత ఎదురైన ఫలితాలు షాకిచ్చాయి. సులువుగా లొంగిపోతుందని భావించిన ఇరాన్ కాస్తా లొంగకుండా ప్రతిదాడులకు దిగడం, ఇజ్రాయెల్ కు ఊహించని ఎదురుదెబ్బలు తగలడంతో అమెరికా ఆత్మరక్షణలో పడింది. చివరకు ఇజ్రాయెల్ ను కాపాడేందుకు రంగంలోకి దిగిన అమెరికా ఇరాన్ లోని అణు స్థావరాల్ని శక్తివంతమైన బీ2 బాంబులు, తోమహాక్ క్షిపణులతో పేల్చేసింది.
అయితే అమెరికా దాడుల్ని ముందే ఊహించిన ఇరాన్ అక్కడి నుంచి అణ్వాయుధాల తయారీకి అవసరమైన శుద్ధి చేసిన యురేనియాన్ని రహస్య ప్రాంతాలకు తరలించేసింది. దీంతో అమెరికా దాడులు చేసి ప్రయోజనం లేకపోయిందన్న చర్చ మొదలైంది. అదే సమయంలో ఇజ్రాయెల్ మరోసారి అతి పెద్ద ద్దైన ఫోర్డో అణు స్థావరంపై దాడులు చేసింది. దీనిపై స్పందించిన అమెరికా.. తాము బాంబులు వేసి ధ్వంసం చేసాక మరోసారి ఎందుకు దాడులు చేస్తున్నారని ఇజ్రాయెల్ ను ప్రశ్నించింది. దీంతో అనుమానాలు బలపడ్డాయి.

ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా నిఘా వర్గాలు ఇరాన్ అణుకేంద్రాలపై తమ దేశం చేసిన దాడులపై సంచలన నివేదిక బయటపెట్టాయి. ఇందులో అమెరికా ఇరాన్ లోని అణు కేంద్రాల్ని దాడుల్లో పూర్తిగా ధ్వంసం చేయలేకపోయిందన్న చేదు నిజాన్ని వెల్లడించాయి. దీంతో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ షాకయ్యాయి. ఇరాన్ మాత్రం ఊపిరిపీల్చుకుంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్పందించారు.

పెంటగాన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ను కోట్ చేస్తూ సీఎన్ఎన్ వార్తా సంస్ధ ఈ వివరాల్ని బయటపెట్టింది. దీంతో ట్రంప్ సీఎన్ఎన్ పైనా మండిపడ్డారు. సీఎన్ఎన్ వార్తా సంస్ధ న్యూయార్స్ టైమ్స్ తో కలిసి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందంటూ తన సోషల్ ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇరాన్ లో అణుస్ధావరాల్ని తాము పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పుకొచ్చారు. చరిత్రలోనే ఇదే గొప్ప దాడిగా ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications