వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. మాములు కేడీలు కాదు, చెంచాతో సొరంగం తవ్వీ.. ఐదుగురు పరార్

|
Google Oneindia TeluguNews

కరడుగట్టిన ఖైదీలు అయినా సరే.. చిన్న నేరం చేసిన వారిని అయినా సరే జైలులో బంధిస్తారు. అందుకోసం తగిన భద్రత ఏర్పాట్లు ఉంటాయి. ఇక విదేశాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. కానీ అలాంటి జైలు నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు పారిపోయారు. అదీ కూడా.. ఓ చిన్న వస్తువు ఉపయోగించి మరీ తప్పించుకున్నారు. వారిని పట్టుకునేందుకు భద్రత బలగాలు రంగంలోకి దిగాయి.

జైలు నుంచి ఇలా..

జైలు నుంచి ఇలా..

భద్రతకు ఇజ్రాయెల్‌ పెట్టింది పేరు. ఆ దేశంలోని జైళ్లలో అధునాతన నిఘాతో పటిష్ఠ భద్రత కొనసాగుతుంది. అలాంటి ఓ జైలులో తుప్పుపట్టిన చెంచాతో సొరంగాన్ని తవ్విన ఓ సాధారణ ఖైదీ సహా.. ఐదుగురు ఇస్లామిక్‌ జిహాదీలు పరారయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ జైళ్ల శాఖ కమిషనర్‌ కేటీ పెర్రీ నిర్ధారించారు. పారిపోయిన వారంతా ఒకే సెల్‌లో ఉండేవారని, ఆ సెల్‌లో ఉన్న సింక్‌ కిందిభాగంలో సొరంగం తవ్వారని ఆయన వివరించారు. వినడానికి ఈ విషయం చాలా వింతగా ఉంది. కానీ నిజం కావడంతో ముక్కున వేలేసుకుంటున్నారు.

సొరంగం తవ్వి..

సెల్‌ నుంచి కొంత దూరం సొరంగం తవ్వారని, జైలు గోడల వెనుక భాగం నుంచి పరారయ్యారని అధికారి పేర్కొన్నారు. నిందితులు జెనిస్‌ వైపు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా 400 మంది ఖైదీలను వేరే జైలుకు తరలించామని వివరించారు. కానీ ఆ ఖైదీ మాములు వ్యక్తులు మాత్రం కాదు. ఎందుకంటే.. జైలు నుంచి తప్పించుకోవడం ఓకే.. కానీ చెంచాతో సొరంగం చేయడం అంటే మాములు విషయం కాదు. అలా తవ్వేందుకు ఎంత సమయం పట్టి ఉంటుందో తెలియడం లేదు.

గుర్తించని అధికారులు

గుర్తించని అధికారులు

అలా తవ్విన జైలు అధికారులు గుర్తించలేదు. ఎలా వారి కళ్లు కప్పారో అర్థం కావడం లేదు. సీసీ కెమెరాల నుంచి ఎలా తప్పించుకున్నారు.. సొరంగం తవ్వడానికి కొద్దీ రోజులు పడుతుంది.. అందులో ఎలాంటి సందేహాం లేదు. కానీ అన్నీ రోజులు కూడా మ్యానేజ్ చేసిన విషయమే ఆశ్చర్యం కలిగిస్తోంది. సొరంగం చేసేందుకు పదునైన ఆయుధమో.. పెద్ద వస్తువో వాడలేదు. కేవలం చిన్న చెంచాతో అలా చేశారు. జైలు అధికారులను మరింత అప్రమత్తం చేశారు. కానీ ఐదుగురు ఖైదీలు మాత్రం పారిపోయారు. ఆ జైలులో భద్రత ప్రమాణాల మీద సందేహాం కలిగి.. 400 మందిని ఇతర జైలుకు తరలించాల్సి వచ్చింది. ఒక్కరు చేసిన పనికి.. వందల మందిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాల్సి వచ్చింది.

మిగతా చోట్ల

మిగతా చోట్ల

ఈ విషయం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఒక ఇజ్రాయెల్ కాదు.. మిగతా దేశాలు కూడా కాసింత ఆందోళనకు గురవుతున్నాయి. తమ దేశంలో గల జైళ్ల పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాయి. లేదంటే.. ఆయా చోట్ల నుంచి కూడా ఖైదీలు కళ్లు గప్పే అవకాశం ఉంది. కానీ చెంచా వాడి జైలు నుంచి తప్పించుకోవడం కామన్ విషయమేమీ కాదని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
dig the tunnel with a spoon. five prisoner escapes from an israeli jail recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X