వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ లో ఆగని అల్లర్లు-ఇమ్రాన్, షెబాజ్ షరీఫ్ వర్గాల పరస్పర దాడులు-ఆహారం విసురుకుంటూ

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ను గద్దెదింపడంతో సంక్షోభం ముగిసిపోయిందని భావిస్తున్నవారికి చేదువార్తలు అందుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ స్ధానంలో గద్దెనెక్కిన ప్రధాని షెబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా ఇమ్రాన్ మద్దతుదారులు నిరసనలకు దిగుతున్నారు. దీంతో వారికి కౌంటర్ గా షరీఫ్ మద్దతుగారులు కూడా ప్రదర్శనలు చేస్తున్నారు.

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన వారసుడు షెహబాజ్ షరీఫ్ మద్దతుదారుల మధ్య జరిగిన ముష్టియుద్ధానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇద్దరు కోపంగా ఉన్న వ్యక్తులు టేబుల్‌పై ఉంచిన ఆహారం, పానీయాలను విసురుకుంటూ పరస్పరం దుర్భాషలాడుకోవడం ఈ వీడియోలో కనిపించింది. అకస్మాత్తుగా, నల్ల కుర్తాలో ఉన్న యువకుడు ఓ వృద్ధుడిని చాలా బలంగా కొట్టాడు. గుంపులోని కొందరు యువకుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, మరికొందరు కింద పడిన వృద్ధుడిని పట్టుకున్నారు. అప్పుడు వృద్ధుడిని నేలపైకి లాగడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

 direct fight between Supporters of Imran Khan, Shehbaz Sharif, throw food at each other

వారం రోజుల రాజకీయ డ్రామా తర్వాత ఏప్రిల్ 9న జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్ స్థానంలో షెహబాజ్ షరీఫ్ కొత్త ప్రధాని అయ్యారు. ఈ ప్రక్రియ ద్వారా తొలగించబడిన దేశంలో మొదటి ప్రధానమంత్రిగా ఖాన్ నిలిచారు. అనంతరం దేశంలో సంక్షోభం సమసిపోయిందని భావించగా.. ఇంకా నిరసనలు మాత్రం ఆగడం లేదు. దీంతో వీటికి అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నిరనసలు ఇలాగే కొనసాగితే మాత్రం వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు ముందస్తుగా జరిగినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. అదే కోరుకుంటున్న ఇమ్రాన్ మద్దతుదారులు.. నిరసనలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

English summary
supporters of both imran khan and pm shehbaz sharif has engaged in a protest today and throw food at each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X