దీపావళి విషెస్ చెప్పిన పాక్ ప్రధాని.. నెటిజన్ల కామెంట్స్ చూస్తే షాక్..

ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ప్రధాన పండగ దీపావళి సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విషెస్ తెలిపారు. పాకిస్థాన్ తోపాటు విదేశాల్లోని హిందువులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మతపరమైన మైనారిటీల హక్కులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న హిందూ కమ్యూనిటీకి గ్రీటింగ్స్ తోపాటు బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే షెహబాజ్ షరీఫ్ ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. పహల్గామ్ దాడిలో భారత్ లోని 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారని.. అలాగే పాకిస్థాన్ లోని ప్రభుత్వం అక్కడి హిందువులు, సిక్కులపై దాడులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి విమర్శల పాలయ్యారు. దీపావళి పండుగ సందర్భంగా పాకిస్థాన్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ చీకటిని పారదోలి సామరస్యాన్ని పెంపొందించి, శాంతి, కరుణ, శ్రేయస్సు వైపు మనల్ని నడిపించాలని స్పష్టం చేశారు. పాకిస్థాన్ సమాజంలో ఉన్న మతాల వైవిధ్యాన్ని తాము గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ విధానం తమ దేశ సమగ్రతను, ఉమ్మడి సంస్కృతిని పెంపొందిస్తుందని పాక్ ప్రధాని అన్నారు. ఇక పాకిస్థాన్ లో హిందువులు అతిపెద్ద మైనారిటీ వర్గంగా ఉన్న విషయం తెలిసిందే.

Diwali Diplomacy or Desperation Shehbaz Sharif s Greetings Ignite Indian Netizen Firestorm on Minority Rights

అయితే షెహబాజ్ షరీఫ్ పోస్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పహల్గామ్ లో హిందువులను చంపి ఇప్పుడు ఇప్పుడు విషెస్ చెబుతారా అంటూ భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ లో హిందువులు, సిక్కులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) ఛైర్మన్ బిలావల్ భుట్టో- జర్దారీ.. దీపావళి సందర్భంగా హిందూ వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు ఎప్పుడూ గెలుస్తుందని.. అలాగే వివక్ష, ద్వేషంపై నిజం, శాంతి, ప్రేమ ఎప్పటికీ విజయం సాధిస్తాయని అన్నారు.

ఇక ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లో ఉగ్రమూకలు జరిపిన దాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్.. ఈ దాడి వెనకాల ఉన్నట్లు గుర్తించిన భారత్.. పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. అలాగే వందల మంది ఉగ్రవాదులను హతమార్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+