కన్యత్వ పరీక్షలు: బుక్కయ్యారు (వీడియో)

స్వీడన్: యువతులకు ఇష్టం లేకున్నా డబ్బు కోసం బలవంతంగా వారికి కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తూ స్వీడన్ వైద్యులు అడ్డంగా చిక్కిపోయారు. అలాంటి వైద్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని స్వీడన్ ప్రభ్వుత్వం తెలిపింది.

కన్యత్వ పరీక్షలు నిర్వహించడం, యువతులను కన్యత్వ పరీక్షలు చేయించుకోవాలని బలవంత పెట్టడం నేరమని స్వీడన్ ప్రభుత్వం చెబుతున్నది. అయితే స్వీడన్ యువతులకు ఇష్టం లేకున్నా వారికి బలవంతంగా కన్యత్వ పరిక్షలు నిర్వహిస్తున్నారని వెలుగు చూసింది.

విషయం తెలుసుకున్న స్వీడన్ లోని కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కల్లా కఫ్తా (కోల్డ్ ప్యాక్ట్) అనే సంస్థ రహస్యంగా ఆపరేషన్ నిర్వహించింది. ముందుగా ఎంపిక చేసుకున్న ఆసుపత్రికి అండర్ కవర్ జర్నలిస్టులు వెళ్లారు.

 Doctors were caught performing virginity tests on girls in Sweden Hospitals

ఆసుపత్రులలో అక్కడక్కడ గుట్టు చప్పుడు కాకుండ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తరువాత ఓ మహిళా జర్నలిస్టు 17 సంవత్సరాల బాలికను పిలుచుకుని ఆసుపత్రికి వెళ్లింది. ఈ అమ్మాయికి కన్యత్వ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ ఇవ్వాలని డాక్టర్ కు చెప్పింది.

ఆ సందర్బంలో యువతి వద్దంటున్నా వైద్యులు కన్యత్వ పరీక్షలు నిర్వహించడానికి సిద్దమవుతూ సీసీ కెమెరాలలో చిక్కి పోయారు. స్వీడన్ ప్రభుత్వ చట్టాన్ని లెక్కచేయకుండా బాలికలకు సైతం కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తున్నారని వెలుగు చూసింది.

విషయం తెలుసుకున్న స్వీడన్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మహిళల సాధనకోసం కృషి చేస్తున్న ప్రపంచ దేశాలలో స్వీడన్ ఉంది. కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తున్న ఆసుపత్రులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్వీడన్ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+