మేయర్ పదవికి కుక్క నామినేషన్: రోజు వచ్చింది..కానీ!

వైట్ టెర్రియర్ జాతికి చెందిన డైలాన్ వెస్టీ అనే ఈ కుక్క టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్ నగర మేయర్ పదవికి పోటీ పడుతోంది. ఆ కుక్క తరపున దాని యజమాని, న్యాయవాది అయిన మైక్ హోవర్డ్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా మే 5న మేయర్ ఎన్నికలు జరగనున్నాయి.
అయితే వెస్టీ తరపున దాఖలు చేసిన నామినేషన్ పత్రాలలో సాంకేతికమైన తప్పులు చాలా ఉండటంతో నగర కౌన్సిల్ నామినేషన్‌ను తిరస్కరించింది. దీంతో వెస్టీ తరపున ప్రచారం నిర్వహించడం ఆలస్యమవుతోందని హోవర్డ్ తెలిపారు. డైలాన్ వెస్టీ ఓ ఆడ వెస్టీ కుక్కకు కొడుకని, అది కూడా రిజిస్టర్ చేయబడి ఉందని, అందువల్ల దానికి మేయర్ పదవికి పోటీ చేసే అవకాశం కల్పించాలని హోవర్డ్ వాదిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా డైలాన్ వెస్టీ ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాలేదని, అందువల్ల పోటీకి అర్హత ఇవ్వలేమని నగర కౌన్సిల్ స్పష్టం చేసింది. అయితే తన డైలాన్ వెస్టీకి అమెరికన్ కెన్నెల్ క్లబ్‌లో కూడా సభ్యత్వం ఉందని హోవర్డ్ పేర్కొంటున్నారు. కాగా 1984 నుంచి పలు పత్రికల్లో మైక్ హోవర్డ్ రాజకీయ వ్యాఖ్యానాలు రాస్తున్నారు. ఇతర నాయకుల వైఖరిని ఎండగడుతూ కూడా పలుమార్లు ఆయన వ్యాఖ్యానాలు రాశారు.












Click it and Unblock the Notifications