మాదీ 1962 చైనా కాదు, అందుకే భారత్ ఇలా: రెచ్చగొట్టేలా డ్రాగన్ కంట్రీ

'1962 సంగ‌తి గుర్తు చేశారుగా... అప్పుడున్న భార‌త్ ఇప్పుడున్న భార‌త్ వేర్వేరు అనే విష‌యం మీరు కూడా గుర్తుతెచ్చుకోండి' అన్న భారత్‌కు చైనా ప్రతిస్పందించింది. మాది కూడా అప్పటి చైనా కాదని అరుణ్ జైట్లీ వ్య

బీజింగ్: '1962 సంగ‌తి గుర్తు చేశారుగా... అప్పుడున్న భార‌త్ ఇప్పుడున్న భార‌త్ వేర్వేరు అనే విష‌యం మీరు కూడా గుర్తుతెచ్చుకోండి' అన్న భారత్‌కు చైనా ప్రతిస్పందించింది. మాది కూడా అప్పటి చైనా కాదని అరుణ్ జైట్లీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది.

ఓ వైపు సరిహద్దు వివాదం కొనసాగుతుండగా, మరోవైపు భారత్‌- చైనా మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైట్లీ చేసిన వ్యాఖ్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

మాదీ అప్పటి చైనా కాదు...

మాదీ అప్పటి చైనా కాదు...

తాము కూడా అప్పటి చైనా కాదని, దేశ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంత వరకైనా వెళ్తామని భారత్‌ను చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ హెచ్చరించాడు.

1890 ఒప్పందం ప్రకారం భారత్ వెనక్కి వెళ్లిపోవాలి

1890 ఒప్పందం ప్రకారం భారత్ వెనక్కి వెళ్లిపోవాలి

నిజమే 1962 నాటి పరిస్థితులతో పోలిస్తే 2017 నాటి భారత్‌కు తేడా ఉందని, అదే సమయంలో చైనా కూడా అంతేనని గుర్తుంచుకోవాలని జెంగ్ షువాంగ్ అన్నాడు. సిక్కిం సరిహద్దు వివాదంపై మాట్లాడుతూ.. 1890 నాటి ఒప్పందానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో భారత్‌.. తమ భూబాగాన్ని వదిలి వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు.

రెచ్చగొట్టేలా..

రెచ్చగొట్టేలా..

దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఎంత వరకు వెళ్లడానికి వెనకాడేది లేదంటూ జెంగ్ షువాంగ్ రెచ్చగొట్టేలా మాట్లాడారు. డోక్లాం ప్రాంతంలో ప్రవేశించడానికి భూటాన్ దేశాన్ని భారత్‌ పావుగా వాడుకుంటోందని అర్థం లేని ఆరోపణలు చేశాడు.

నరేంద్ర మోడీ - ట్రంప్‌లంటూ పత్రిక కథనం

నరేంద్ర మోడీ - ట్రంప్‌లంటూ పత్రిక కథనం

మరోవైపు, తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న తమను అడ్డుకునేందుకు ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్న చైనా - భారత్ సరిహద్దులో భారత ఆర్మీ బలగాలు అలజడి సృష్టించాయని చైనా పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అమెరికా పర్యటనకు ముందు సరిహద్దులో అలజడికి కారణం.. మోడీ.. ట్రంప్ భజనకు నిదర్శనమని వ్యాఖ్యానించింది. డీ గ్లోబలైజేషన్, అమెరికన్ ఫస్ట్ అనే పాలసీకి ట్రంప్ కట్టుబడి ఉంటారని, మోడీ ప్రపంచీకరణకు, మేకిన్ ఇండియా పాలసీకు కట్టుబడి ఉంటారని, వీరి మధ్య అసలు సయోధ్య కుదరదని ఆ పత్రిక పేర్కొంది.

ఇదీ విషయం..

ఇదీ విషయం..

అయితే చైనా చెప్పింది అబద్దమని భారత్, భూటాన్ దేశాలు చెబుతున్నాయి. డోక్లామ్‌లో రోడ్డు నిర్మించడాన్ని విరమించుకోవాలని భూటాన్ ఆర్మీ చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. అయినా కూడా తమ దేశం చేసిన తప్పును సమర్థించుకునేందుకు ఆ పత్రిక ప్రయత్నించింది. మోడీ - ట్రంప్‌ల మధ్య జరిగిన భేటీ కారణంగా భారత్‌కు ఒరిగేదేమీ లేదని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

సిక్కిం సరిహద్దు వివాదం

సిక్కిం సరిహద్దు వివాదం

కాగా, రెండు దేశాల మధ్య ఉన్న సిక్కిం సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత అనుభవాలను భారత్‌ దృష్టిలో ఉంచుకుని మసలుకోవాలంటూ 1962 యుద్ధాన్ని చైనా తొలుత గుర్తు చేసింది. దీనిపై స్పందించిన జైట్లీ '1962 నాటి భారత్ వేరు.. 2017 నాటి భారత్ వేరు అని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+