సంబరాలు అద్దిరిపోయాయ్..!!
Donald Trump's swearing-in ceremony: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకొక్క రోజు మాత్రమే మిగిలివుంది. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
గత ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌ను చిత్తు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వెస్ట్ ఫ్రంట్‌కు బదులుగా కేపిటల్ వన్ ఎరినాలోకి మారిందీ కార్యక్రమం.

ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు డొనాల్డ్ ట్రంప్-జేడీ వాన్స్ ఇనాగ్యురల్ కమిటీ ఆహ్వాన పత్రికలను పంపించింది. భారత్ సహా జీ20, బ్రిక్స్ ప్లస్.. వంటి అత్యున్నత గ్రూప్‌లల్లో సభ్య దేశాలకూ ఈ ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అందాయి.
ప్రమాణ స్వీకారం చేయడానికి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 5:20 నిమిషాలకు భార్య మెలానియా, కుమారుడు బారోన్ ట్రంప్‌తో కలిసి ఇక్కడి డల్లెస్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా నార్త్ వర్జీనియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు బయలుదేరి వెళ్లారు.
ఇక్కడ ప్రీ- సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు. ఇక్కడ సంబరాలు అద్దిరిపోయాయి. ఆకాశాన్నంటేలా బాణాసంచాను కాల్చారు. దీని వెలుగులో ఈ ప్రాంతం మొత్తం నిండిపోయింది. మూడు గంటల పాటు ప్రీ- ఇనాగ్యురేషన్ సెలబ్రేషన్స్ జోరుగా సాగాయి.
భార్య మెలానియా ట్రంప్, కుమారుడు బరోన్, కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నెర్‌తో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు. ప్రఖ్యాత గాయకులు క్యారీ అండర్‌వుడ్, బిల్లీ రే సైరస్, జేసన్ అల్డీన్, ర్యాపర్ నెల్లీ, మ్యూజిషియన్ కిడ్ రాక్‌తో మ్యూజికల్ నైట్‌ను నిర్వహించారు. రాత్రి ఇక్కడే బస చేయనున్నారు ట్రంప్.












Click it and Unblock the Notifications