Donald Trump: జెలెన్స్కీకి ట్రంప్ మరో షాక్.. మూడేళ్ల క్రితమే ముగించాల్సి ఉండేదంటూ..

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీపై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రారంభించినందుకు ఆయనను నిందించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత దాదాపు మూడు సంవత్సరాల క్రితమే యుద్ధాన్ని జెలెన్స్కీ ముగించి ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు, మూడేళ్ల క్రితమే రష్యాతో ఒప్పందం ద్వారా ముగించి ఉండాలని అభిప్రాయపడ్డారు. అమెరికా-రష్యా చర్చల నుంచి తనను మినహాయించడం పట్ల ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి. సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలకు ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ ను ఆహ్వానించలేదు. ఉక్రెయిన్ కు ఆహ్వానం లభించకపోవడంతో ఈ చర్చల ఫలితాన్ని తాము అంగీకరించలేమని జెలెన్స్కీ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ మాట్లాడుతూ.. "మిమ్మల్ని ఆహ్వానించలేదు.. సరే.. మీరు మూడు సంవత్సరాల పాటు యుద్ధంలో ఉన్నారు. దానిని మీరు ముగించి ఉండాలి. యుద్ధాన్ని ప్రారంభించి ఉండకూడదు. ఒక ఒప్పందం కుదుర్చుకుని ఉండవచ్చు." అని అమెరికా అధ్యక్షుడు అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఈ నెలలో కలుస్తానని కూడా అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. అంతకు ముందు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపై పుతిన్, జెలెన్స్కీ ఇద్దరితోనూ తాను సంప్రదింపులు జరుపుతున్నానని ట్రంప్ చెప్పారు.

Donald Trump Criticizes Zelensky Says the War Should Have Ended Three Years Ago

రియాద్ లో జరిగిన అమెరికా-రష్యా చర్చల గురించి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ గురించి చర్చించడానికి ట్రంప్-పుతిన్ శిఖరాగ్ర సమావేశానికి ఇరుపక్షాలు తేదీని నిర్ణయించలేదని అన్నారు. ఉక్రెయిన్, యూరప్ లోని భాగస్వాములు, ఇతరులతో సంప్రదింపులు జరుగుతాయని రూబియో అన్నారు. కానీ చివరికి ఈ ప్రయత్నానికి రష్యా వైపు నుంచి సహకారం అనివార్యమవుతుందన్నారు. ఉక్రెయిన్ సమస్యను నిర్వహించినందుకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ విమర్శించారు. ఈ యుద్ధాన్ని ముగించే శక్తి నాకు ఉందని భావిస్తున్నానని ట్రంప్ గతంలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+