మాకు ఏదో చేసినట్లుగా: భారత్‌పై ట్రంప్ ఫైర్, మోడీ ఇలా చెప్పారంటూ..
వాషింగ్టన్: విదేశాల్లో తయారయ్యే బైకులపై 75 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 50 శాతానికి తగ్గించినట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఫోన్ చేసి చెప్పారంటూ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
అమెరికాలో తయారయ్యే హార్లీ డేవిడ్‌సన్ బైక్‌ల వ్యవహారంలో ట్రంప్ తాజాగా మరోసారి భారత్ పైన విమర్శలు చేశారు. అత్యంత ఖరీదైన బైకులపై భారీ స్థాయిలో విధిస్తున్న దిగుమతి సుంకాన్ని భారత్ ఇటీవల తగ్గించినా ఆ చర్యతో అమెరికాకు ఒరిగేదేమీ లేదన్నారు.

మాకేదో చేసినట్లు
డొనాల్డ్ ట్రంప్ అన్ని రాష్ట్రాల గవర్నర్లతో వైట్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మోడీ తనకు ఫోన్ చేసి ఈ బైకులపై ఉన్న ఇంపోర్టెడ్ ట్యాక్స్‌ను కొంత తగ్గించినట్లు చెప్పారని ఎద్దేవా చేశారు. ఈ దిగుమతి సుంకం తగ్గింపుతో అమెరికాకు ఏదో మేలు చేసినట్లు భారత్ భావిస్తోందని, కానీ అలాంటిదేమీ లేదన్నారు.

భారత్ బైకులు మనం దిగుమతి చేసుకుంటున్నా
భారత్‌కు మాత్రం యాభై శాతం దిగుమతి సుంకం రూపంలో ఆదాయం సమకూరుతుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో తయారయ్యే బైకులను దిగుమతి చేసుకుంటున్నా తమకు ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని ట్రంప్ అన్నారు.

ట్రంప్ హెచ్చరికలు
హార్లీ డేవిడ్‌సన్ బైకుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ మండిపడడం ఇటీవల ఇది రెండోసారి. అవసరమైతే అమెరికాలో అమ్ముడయ్యే భారతీయ మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకాన్ని పెంచుతామని ఈ నెల 14న హెచ్చరించారు.
Recommended Video


ప్యారిస్ ఒప్పందంపై
ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న విషయంలోను భారత్, చైనాలపై ట్రంప్ మండిపడ్డారు. ఈ దేశాల వల్లే ప్యారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. భారత్, చైనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు అని చెబుతున్నారి, అమెరికా మాత్రం అభివృద్ధి చెందిన దేశం అంటున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications