వలసదారుల బహిష్కరణకు ట్రంప్ కొత్త ప్లాన్-18వ శతాబ్దపు ఏలియన్స్ చట్టంతో..!
అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసదారుల్ని దేశం నుంచి తరిమేసేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు ఇబ్బందులు తప్పడం లేదు. వలసదారుల్ని భారీ ఎత్తున తరిమేస్తే అమెరికా ఆర్ధిక వ్యవస్థకు చేటుగా మారే ప్రమాదం ఉండటంతో ఈ ప్రక్రియ దూకుడుగా ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా వలసదారుల తరలింపుకు భారీ ఎత్తున నిధులు ఇచ్చేందుకు అమెరికా కాంగ్రెస్ అంగీకరించడం లేదు. దీంతో ట్రంప్ 18వ శతాబ్దం నాటి ఓ క్రూర చట్టాన్ని తెరపైకి తెస్తున్నారు.
18వ శతాబ్దంలో అమెరికాలో ఏలియన్స్ వంటి శత్రువుల్ని తరిమేసేందుకు వాడిన ఓ క్రూర చట్టాన్ని ఇకపై వలసదారులపై ప్రయోగించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు 3 శతాబ్దాల కిందటి చట్టానికి పదునుపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తే యుద్ద ప్రాతిపదికన వలసదారుల్ని దేశం నుంచి ఖాళీ చేయించవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో ఈ ఏలియన్ చట్ట ప్రయోగం ఆలోచనపై ఆందోళనలు మొదలయ్యాయి.

వాస్తవానికి ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయగానే ఈ చట్టం అమలుకు సంకేతాలు ఇచ్చారు. అయితే దీన్ని అమలు చేస్తే కోర్టుల్లో చిక్కులు తప్పవని ఆయన న్యాయ సలహాదారులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించిన ట్రంప్.. ఇప్పుడు దీన్ని తిరిగి తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. ఈ చట్టాన్ని ఎలా అమలు చేయవచ్చో అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. అలాగే దీని అమలుకు ముహుర్తం కూడా సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని ముందుగా విదేశీ తీవ్రవాద సంస్థగా ప్రకటించిన ట్రెన్ డే అరాగ్వా గ్యాంగ్ పై ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఏలియన్ శత్రువుల చట్టం కింద జరిగే నిర్బంధాలు, బహిష్కరణలు ఇమ్మిగ్రేషన్ కోర్టు వ్యవస్థ ద్వారా జరగవు. ఇది వలసదారులకు ఉపశమనం పొందేందుకు, దేశంలోనే తమ వాదనను వినిపించడానికి అవకాశం కల్పిస్తుంది. కేసులు సంవత్సరాలు పట్టే బ్యాక్‌లాగ్డ్ కోర్టు వ్యవస్థ, ట్రంప్ సామూహిక బహిష్కరణ ప్రణాళికలకు గణనీయమైన అడ్డంకిగా ఉంటుందని నిపుణులు గుర్తించారు. అలాగే ఇది మరొక దేశంతో యుద్ధంలో ఉంటే లేదా ఒక విదేశీ దేశం అమెరికాపై దాడి చేసినట్లయితే లేదా అలా చేస్తామని బెదిరిస్తే అమలు చేయడానికి తెచ్చారు. గ్యాంగ్‌లు లేదా కార్టెల్స్ నుండి బెదిరింపులను సాకుగా చూపుతూ దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా అమెరికాపై విదేశీ ప్రభుత్వం దాడి చేయనప్పుడు ఈ చట్టాన్ని ఉపయోగించడం ట్రంప్‌కు కష్టమని న్యాయ నిపుణులు అంటున్నారు.












Click it and Unblock the Notifications