వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధానికి అంతా సిద్ధం, అదే జరిగితే: ట్రంప్, తగ్గని ఉత్తర కొరియా

ఉత్తర కొరియా, అమెరికాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉత్తర కొరియాను పూర్తిగా తుదముట్టేంచేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అగ్ర రాజ్యం అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తర కొరియా, అమెరికాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉత్తర కొరియాను పూర్తిగా తుదముట్టేంచేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అగ్ర రాజ్యం అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

చదవండి: 'యుద్ధం ప్రకటించిన ట్రంప్', అమెరికా క్షిపణులు ధ్వంసం చేసినట్లు ఉత్తర కొరియా వీడియో

స్పానిష్ ప్రధానమంత్రి మరియానో రాజోయ్‌తో కలిసి ఆయన మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా హెచ్చరికలపై స్పందించారు.

యుద్ధానికి సిద్ధమే కానీ, అది రెండో ఆప్షన్

యుద్ధానికి సిద్ధమే కానీ, అది రెండో ఆప్షన్

ఉత్తర కొరియాతో యుద్ధానికి సిద్ధమేనని ట్రంప్ ప్రకటించారు. అయితే అది కేవలం రెండో ఆప్షన్ మాత్రమే అన్నారు. అవసరమైతే, యుద్ధం వస్తే మాత్రం తాము సిద్ధమని ప్రకటించారు. అదే కనుక జరిగితే ఉత్తర కొరియా పూర్తిగా నాశనమవుతుందని చెప్పగలనని ట్రంప్ అన్నారు. కొరియాను పూర్తిగా నాశనం చేసేందుకు అమెరికా సిద్ధమన్నారు.

తొలి ప్రాధాన్యత కాకపోయినప్పటికీ..

తొలి ప్రాధాన్యత కాకపోయినప్పటికీ..

ఉత్తర కొరియాతో అవసరమైతే సైనిక చర్యకు సిద్ధమని యుద్ధాన్ని ఉద్దేశించి ట్రంప్ అన్నారు. యుద్ధం తమ మొదటి ప్రాధాన్యత కాకపోయినప్పటికీ, దానికి సిద్ధమని, చూద్ధాం ఏమవుతుందో అన్నారు.

అమెరికా బాంబర్లను కూలుస్తామని హెచ్చరిక

అమెరికా బాంబర్లను కూలుస్తామని హెచ్చరిక

మరోవైపు, ఉత్తర కొరియా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా కొరియా ద్వీపకల్పం సమీపంలో ఎగిరే అమెరికా బాంబర్లను నేలకూలుస్తామని హెచ్చరించింది.

ట్రంప్ యుద్ధం ప్రకటించాడన్న ఉత్తర కొరియా

ట్రంప్ యుద్ధం ప్రకటించాడన్న ఉత్తర కొరియా

ట్రంపు తొలుత మా దేశంపై యుద్ధం ప్రకటించారని, దీంతో తమ దేశానికి ఆత్మరక్షణ చర్యలకు దిగే హక్కు ఉందని, దీనిలో భాగంగా ఉత్తర కొరియా భూభాగంలోకి రాకుండా సమీపంలో ఎగిరే బాంబర్లను కూడా నేల కూలుస్తామని ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రి రి యంగ్‌ అంతకుముందు ప్రకటించారు.

అంతకుముందు అమెరికా ఖండన

అంతకుముందు అమెరికా ఖండన

ట్రంప్ ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించాడన్న వార్తలను అంతకుముందు వైట్ హౌస్ ఖండించింది. అది అబద్దపు ప్రచారమని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి శారా శాండర్స్ అన్నారు. కానీ మరుసటి రోజే తాము యుద్ధానికి సిద్ధమని ట్రంప్ ప్రకటించారు.

English summary
The US armed forces stand completely ready for the "military option" on the Korean Peninsula, US President Donald Trump said Tuesday at the White House's Rose Garden during a joint news conference with Spanish Prime Minister Mariano Rajoy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X