వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'యుద్ధం ప్రకటించిన ట్రంప్', అమెరికా క్షిపణులు ధ్వంసం చేసినట్లు ఉత్తర కొరియా వీడియో

తమ దేశం పైన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ప్రకటించారని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మంత్రి రి యాంగ్ హో సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

North Korea Angry over Trump's Tweet యుద్ధం ప్రకటించిన ట్రంప్,అమెరికా క్షిపణులు ధ్వంసం | Oneindia

వాషింగ్టన్: తమ దేశం పైన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ప్రకటించారని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మంత్రి రి యాంగ్ హో సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసారు.

చదవండి: యుద్ధం మొదలైతే: ఉ.కొరియా క్షిపణి దాడిచేస్తే.. అమెరికాకు అంత సత్తా లేదా?

యుద్ధం ప్రకటించినట్లు ట్రంప్ లేఖలు

యుద్ధం ప్రకటించినట్లు ట్రంప్ లేఖలు

ఉత్తర కొరియాపై యుద్ధం మొదలుపెట్టామని, అన్ని దేశాలు తమకు మద్దతుపలకాలని' ట్రంప్ అన్ని దేశాల పార్లమెంట్‌లకు బహరంగ లేఖలు రాశారని ఉత్తర కొరియా ఆరోపించింది. ఆదివారమే అన్ని దేశాల పార్లమెంట్‌లకు ఆ లెటర్లు చేరాయని తెలిపింది.

సర్వనాశనం చేస్తామన్నారు

సర్వనాశనం చేస్తామన్నారు

తమపై తీవ్ర కక్ష్య పెంచుకుని ట్రంప్ ఈ రకమైన కవ్వింపు చర్యలకు దిగుతున్నారని ఉత్తర కొరియా పార్లమెంటరీ కమిటీ తెలిపింది. సెప్టెంబర్19న ట్రంప్ ఐక్య రాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో ప్రసగింస్తూ ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తామని ప్రకటించారని అన్నారు.

ఆ ప్రకటన నిజం చేసే పనిలో ట్రంప్, కానీ తలవంచం

ఆ ప్రకటన నిజం చేసే పనిలో ట్రంప్, కానీ తలవంచం

ఇప్పుడు ఆ ప్రకటనను నిజం పనిలో అమెరికా అధ్యక్షులు ఉన్నారని ఉత్తర కొరియా పేర్కొంది. అయితే తాము అమెరికా ముందు తలవంచే పరిస్థితి రాదన్నారు.

మా హైడ్రోజన్ బాంబు దెబ్బ రుచి చూస్తారు

మా హైడ్రోజన్ బాంబు దెబ్బ రుచి చూస్తారు

ఉత్తర కొరియాతో అమెరికా యుద్ధానికి దిగితే హైడ్రోజన్ బాంబు దెబ్బను రుచిచూస్తారని అమెరికాను హెచ్చరించింది. ఉత్తర కొరియా పార్లమెంటరీ కమిటీ కూడా అమెరికా లెటర్లకు ప్రతిగా అన్ని దేశాల పార్లమెంట్లకు లెటర్లు రాసింది. అమెరికా తీరును ఆ లెటర్లలో ఎండగట్టింది.

క్షిపణులు, బాంబర్లు ధ్వంసం.. వీడియో హెచ్చరిక

క్షిపణులు, బాంబర్లు ధ్వంసం.. వీడియో హెచ్చరిక

మరోవైపు, అమెరికాకు చెందిన క్షిపణులు, బాంబర్స్, జెట్ విమానాలను ఉత్తర కొరియా ధ్వంసం చేసినట్లుగా, అమెరికా అస్త్రాలను ముక్కలు ముక్కలుగా పేల్చి వేసినట్లుగా ఉత్తర కొరియా వీడియో రూపొందించి, దానిని విడుదల చేసి అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది.

వీడియోలో ఇలా...

వీడియోలో ఇలా...

వీడియోను రూపొందించిన ఉత్తర కొరియా.. అందులో అమెరికా క్షిపణులు, బాంబర్లు, జెట్ విమానాలను పేల్చివేసింది. దాదాపు నిమిషంన్నర పాటు ఉన్న ఈ వీడియోలో మొదట ట్రంప్‌ కనిపించారు. కిమ్‌ను రాకెట్ మ్యాన్‌గా ట్రంప్ వర్ణించారు. అనంతరం అమెరికా అస్త్రాలను ఉత్తర కొరియా క్షిపణులతో పేల్చివేస్తున్నట్టు వీడియోని రూపొందించారు.

మాపై దాడి జరిగితే సమాధి కావాల్సిందే

మాపై దాడి జరిగితే సమాధి కావాల్సిందే

ఈ వీడియోను ఉత్తర కొరియా మీడియా ప్రచురించింది. ఉత్తర కొరియా మీద ఏదైనా దాడి జరిగితే అమెరికా దళాలు సమాధిపాలు కావల్సిందేనని వీడియోలో అమెరికాను హెచ్చరించారు. అమెరికా బాంబర్లు ఉత్తర కొరియా సరిహద్దులో చక్కెర్లు కొట్టిన అనంతరం ఈ వీడియోని ఉత్తర కొరియా రూపొందించింది.

English summary
North Korea's Foreign Minister Ri Yong Ho on Monday accused US President Donald Trump of declaring war on his country by tweeting over the weekend that North Korea "won't be around much longer."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X