ఇరాన్‌పై మరో యుద్ధం.. ట్రంప్ టేబుల్‌పై 7 రోజుల ప్లాన్!

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌పై మరోసారి భారీ సైనిక దాడులు నిర్వహించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 4 నుంచి 7 రోజుల పాటు ఇరాన్ దేశంపై నిరంతరాయంగా వైమానిక దాడులు జరపాలని ఇజ్రాయెల్ అమెరికాపై ఒత్తిడి తెస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. అయితే ఈ విషయంలో ట్రంప్ ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

1945లో యాల్టా.. ఇప్పుడు షెన్‌జెన్! ప్రపంచ చరిత్ర మళ్లీ తిరగరాయబోతున్నారా?
1945లో యాల్టా.. ఇప్పుడు షెన్‌జెన్! ప్రపంచ చరిత్ర మళ్లీ తిరగరాయబోతున్నారా?

ఇజ్రాయెల్ హెచ్చరిక.. 7 రోజుల ప్లాన్ ఏమిటి?
ఇరాన్ తన క్షిపణి, డ్రోన్ నిల్వలను మళ్లీ భారీగా సమకూర్చుకుంటోందని, అంతే కాకుండా కెమికల్, బయోలాజికల్ ఆయుధాల తయారీ సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోందని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తప్పవని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇందులో భాగంగా యుద్ధ విమానాల ద్వారా 4 నుంచి 7 రోజుల పాటు ఇరాన్‌లోని కీలక స్థావరాలపై భీకర వైమానిక దాడులు చేయాలనే ప్రణాళికను ఇజ్రాయెల్ అమెరికా ముందుంచింది.

Donald Trump Weighs Fresh Strikes on Iran as Israel Pushes 7-Day Air Operation Plan Full Details

సైనిక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిన పెంటగాన్
మరోవైపు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ఇప్పటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సైనిక ప్రత్యామ్నాయాలను వివరించింది. ఇరాన్‌లోని ప్రధాన సైనిక స్థావరాలతో పాటు ఆ దేశ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే ప్రణాళికలు ఇందులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ ఒక్క ప్రణాళికకు ట్రంప్ ఇంకా పచ్చజెండా ఊపలేదు. అన్ని కోణాల్లో సాధ్యాసాధ్యాలను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ముగ్గురు మొనగాళ్ల భేటీ.. ఉక్రెయిన్ గుండెల్లో రైళ్లు!
ముగ్గురు మొనగాళ్ల భేటీ.. ఉక్రెయిన్ గుండెల్లో రైళ్లు!

అమెరికా అధికారుల్లోనే భిన్నాభిప్రాయాలు
ఈ వ్యవహారం ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇరాన్‌పై దాడి విషయంలో అమెరికా ఉన్నతాధికారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఇరాన్ ఆయుధ సమీకరణపై అందిన ఇంటెలిజెన్స్ సమాచారం ఎంతవరకు కచ్చితమైనదనే దానిపై అధికారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా మళ్లీ యుద్ధం మొదలుపెడితే పశ్చిమాసియాలో తలెత్తే తీవ్ర పరిణామాలు, ప్రమాదాలపై పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోయే తదుపరి నిర్ణయంపైనే ఇప్పుడు ప్రపంచ దేశాల చూపు నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+