సెక్స్‌కి నో చెప్పిందని, గర్ల్‌ఫ్రెండ్ పిరుదులపై చేయి: జైలుకెళ్లాడు
లండన్: గర్ల్ ఫ్రెండ్ పిరుదుల పైన చేయి వేసిన బాయ్‌ఫ్రెండ్ జైలు పాలైన సంఘటన లండన్‌లో వెలుగు చూసింది. ఈ సంఘటన ప్రేమికుల దినోత్సవం నాడు జరిగింది. ప్రేమికుల దినోత్సవం రోజు రాత్రి తనతో శృంగారంలో పాల్గొనందుకు అంగీకరించలేదని ఆమెను బలవంతం చేశాడు.
దీంతో అతను జైలు పాలు కావాల్సి వచ్చింది. లండన్‌కు చెందిన రైస్ వెదర్ బర్న్ వయస్సు ఇరవై ఏళ్లు. ప్రేమికుల రోజు సందర్భంగా లండన్‌లోని ప్రముఖ హోటల్లో రాత్రి తన ప్రియురాలితో కలిసి రొమాన్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇందుకోసం ఓ గదిని భారీ మొత్తం చెల్లించి ఓ గదిని బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరు కలిసి మద్యం సేవించారు. ప్రేమికుల రోజును గుర్తు చేసుకుంటూ వారు గడిపారు. ఆ తర్వాత అతను మెల్లిగా ఆమె పైన చేయి వేశాడు. పిరుదులపై చేయి వేసి కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు.
దీంతో ఆ గర్ల్ ఫ్రెండ్ ఒక్కసారిగా కేకలు వేసింది. తన పైన లైంగిక దాడికి ప్రయత్నించాడని కంటతడి పెట్టింది. రక్షించాలని అరిచింది. ఆమె కేకలు విన్న హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జైలు పాలయ్యాడు. తన ప్రియురాలితో తనకు ఏడాది నుంచి బంధం ఉందని, తాగిన మత్తులో అలా చేశానని ప్రియుడు చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications