సగం బెడ్ అద్దెకు ఇచ్చి సంపాదన.. హాట్ బెడ్డింగ్ అంటే ఏంటో తెలుసా?
అద్దెకు ఇళ్లు, వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులు తీసుకోవడం మనం చూసుంటాం. మరి కొంతమంది ఇంకొన్ని వస్తువులు, స్థలాలు అద్దెకు ఇస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం తన బెడ్ అద్దెకు ఇచ్చి సంపాదించేస్తోంది. దీనినే హాట్ బెడ్డింగ్ అంటారట. ఈ వ్యవహారం గురించి మీకు తెలుసా..?
2020లో వచ్చిన కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ఓ మహిళ వినూత్న ప్రయోగానికి తెరలేపింది. ఆమె సరికొత్త ఆలోచనతో ఇప్పుడు చేతినిండా సంపాదిస్తోంది. క్వీన్స్ ల్యాండ్ కు చెందిన 38 ఏళ్ల మహిళ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. కారణం ఆమె వినూత్న ఆలోచన. ఆమె ప్రారంభించిన హాట్ బెడ్డింగ్ వ్యవహారం. ఇప్పుడు అందరూ ఈ హాట్ బెడ్డింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు.
క్వీన్స్ ల్యాండ్ కు చెందిన 38 ఏళ్ల మోనిక్ జెరేమియా.. హాట్ బెడ్డింగ్ అనే ఈ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనర్థం.. మిగిలిన వస్తువుల్ని ఎలా అయితే అద్దెకు ఇస్తామో.. అలానే మనం పడుకునే మంచంలో సగ భాగాన్ని అద్దెకు ఇవ్వడం అన్నమాట. ఈ హాట్ బెడ్డింగ్ కాన్సెప్ట్ ఇదే.

అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ లో కీలక విషయం ఇదే. బెడ్ ఇచ్చింది కదా అని పడుకుని ఏదో చేయడం కాదు.. మంచంలో మనతో పాటు పడుకునే వారు ఎవరైనా సరే.. ఎలాంటి భావోద్వేగాలకు సంబంధం లేకుండా పడుకోవాలన్నదే ఆమె కాన్సెప్ట్. అలా పడుకోవాలని అనుకున్నవారే రావాలని ఆమె తెలిపింది.
ఒకరినొకరు గౌరవిస్తూ.. రూల్స్ పాటిస్తూ ఇలా చేయడం ద్వారా సంపాదించుకోవచ్చని ఆమె తెలిపారు. కరోనా సమయంలో జాబ్ కోల్పోయానని.. ఒంటరిగా ఉండేదాన్ని.. ఆ టైంలోనే ఈ హాట్ బెడ్డింగ్ ఆలోచన వచ్చిందని మోనిక్ జెరేమియా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ హాట్ బెడ్డింగ్ కాన్సెప్ట్ క్వీన్స్ ల్యాండ్ తో పాటు పలు దేశాల్లో పాపులర్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications